tuesday article thumb.jpg

భావకవిత్వ ఝరీ- దేవులపల్లి కృష్ణశాస్త్రి

Spread the love

భావకవిత్వ ఝరీ- దేవులపల్లి కృష్ణశాస్త్రి

బోర భారతీదేవి
స్కూల్ అసిస్టెంట్-తెలుగు విశాఖపట్నం
9290946292

మావిచిగురు తినగానే…..
ఆరనీకుమా ఈ దీపం….
ప్రతి రాత్రి వసంత రాత్రి….
ఇది మల్లెల వేళయనీ ….
గోరింట పూసింది కొమ్మ లేకుండా…..

పాటలు వినగానే గుర్తొచ్చేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
నాటికి నేటికి ఎప్పటికీ ఆ పాటలు వింటే పరవశించని హృదయం అంటూ లేదనడం లో అతిశయోక్తి లేదు.

కృష్ణశాస్త్రి కవిత్వం చదివితే……..,

“కృష్ణపక్షం” కావ్యంలో విరహ వేదన
“మువ్వగోపాలం”లో భక్తి, “మేఘమా”లో ప్రకృతి సౌందర్యం… మూడు రసాలు కన్పిస్తాయి.

భావ కవిత్వం ఆయనకు ఆయనే సాటి

ఒక సందర్భంలో
విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు కిట్స్, షెల్లీ, వర్ద్సు, వర్తుల వంటి కవులు లేరు ఆ కవులు మన దేశంలో కృష్ణ శాస్త్రిగా జన్మించారని అభిప్రాయపడ్డారు
భావ కవిత్వంలో రారాజుగా తన రచనలతో తెలుగు సాహిత్యంలో చెరగని ముద్రను వేశారు.

జీవిత విశేషాలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలో చంద్రంపాలెం గ్రామంలో ఒక పండిత కుటుంబంలో1897 నవంబర్ 1న జన్మించారు ఆయన తండ్రి మహా పండితులు. వారి ఇంట్లో నిరంతరం ఏదో ఒక సాహిత్య చర్చలు జరుగుతూనే ఉండేది.
ఆ ప్రభావమే కృష్ణశాస్త్రి గారు చిన్నతనం నుండే రచనలు చేసేలా ప్రోత్సహించింది. ఆయన విద్యాభ్యాసం పిఠాపురంలో సాగింది.సంస్కృతంలో పండితులు.పాఠశాలలో గురువులైన కూచి నరసింహం రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని కృష్ణశాస్త్రి గారు చెప్పుకున్నారు.
1918 విజయనగరంలో డిగ్రీ పూర్తి చేసి తెలియ కాకినాడ పట్నంలో ఉద్యోగం లో చేరారు. పెద్దాపురం మెషిన్ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు

విద్యార్థుల కోసం. ….
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ గీతాన్ని రాశారు

వ్యావహారిక భాషావాదం బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్న కాలంలో
కృష్ణశాస్త్రి గారు వృత్తిని వదిలి బ్రహ్మ సమాజంలో చురుగ్గా పాల్గొనేవారు. అదే సమయంలో సాహితీ వ్యాసంగాన్ని కూడా కొనసాగించారు.

కృష్ణపక్షం కావ్య నేపథ్యం

1920లో ఒకసారి వైద్యం కోసం రైలులో బళ్ళారి వెళ్తుండగా చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి సౌందర్యానికి రైలు పట్టాల లయ కు పరవశించి……
ఆకులు ఆకునై పువ్వులో పువ్వునై…..అని పలవరించారట…,..
అదే తెలుగు భావకవితా యుగంలో ఓ ముఖ్యమైన ఘట్టం.

ప్రకృతి నుంచి లభించిన ప్రేరణ కారణంగా కృష్ణపక్షం రూపుదిద్దుకుంది

కృష్ణపక్షం నుండి కొన్ని…

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు?
నా యిచ్చయే గాక నా కేటి వెరపు?

సౌరభములేలా చిమ్ము పుష్పవజ్రంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?

భార్యా వియోగం
1922 భార్య వినియోగానంతరం ఆయన రచనల్లో విషాదం అధికమైంది

మరో వివాహం చేసుకొని ఉద్యోగం వదిలి బ్రహ్మ సమాజంలోనూ నవసాహిత్య సభ్యుని భావకవితోద్యమ ప్రవర్తకుడిగా దేశమంతా ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు హరి జనోదరణ కార్యక్రమాల్లో పాల్గొన్నందున బంధువులు వ్యతిరేకించి వెలివేశారు అయినా వెనకాడని ధైర్యశాలి.
అంతటితో ఆగక దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వేశ్య వివాహ సంస్థను ఏర్పాటు చేసి కళావతులకు వివాహలు నిర్వహించారు.

సంఘసంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఊర్వశి కావ్యాన్ని జాతికి అందించారు. 1929 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తో పరిచయం ఏర్పడి వారిద్దరి మధ్య సాహిత్య సంబంధాలు బలపడ్డాయి.

1942 లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు రాసి చిత్ర పరిశ్రమలో తొలిసారి అడుగుపెట్టిన కృష్ణశాస్త్రి గారు తర్వాత అనేక చిత్రాలకు ఆయన సాహిత్యాన్ని అందించారు.

ఆకాశవాణి- ప్రయోక్త
ఆకాశవాణిలో తెలుగు సాహిత్య ప్రయోక్తగా పనిచేస్తూ ఎన్నో గేయాలు, నాటికలు, విలువైన ప్రసంగాలు అందించారు.

ముఖ్య రచనలు:
కృష్ణపక్షం, మహాతి, ప్రేమకిరణం, సౌందర్యతిలకం.- కావ్యాలు
మువ్వగోపాలం — గేయ సంపుటి.
“పద్యప్రపూర్ణ” – పద్యకావ్యం

తెలుగు సినిమా పాటలు
సంగీతానికి దేవులపల్లి వేసిన పునాది బలమైనది. ఆయన పాటలు ఇప్పటికీ క్లాసిక్స్.

శైలి ప్రత్యేకత
సంస్కృత పదాలను సున్నితంగా తెలుగులోకి తీసుకొచ్చిన వాడు
ప్రకృతి వర్ణనలో అందెవేసిన చేయి. భావకవిత్వం భావాలను నేరుగా చెప్పకుండా ప్రతీకలు, ఉపమలతో చెప్పడం ఆయన ప్రత్యేకత.

బిరుదులు- పురస్కారాలు

భావకవిగా ఆంధ్రా షెల్లిగా ప్రసిద్ధులైన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వరి సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆ పాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ గారు శ్లాఘించారు.

లాలిత్యం సారళ్యం ప్రకృతి సౌందర్యం కృష్ణశాస్త్రి గారి పాటల్లో ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు హృదయ స్పందనలకు అక్షర రూపం ఇచ్చిన భావకవితలంత సుకుమారంగా ప్రణయ విహార గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన ఆరాధన గల భక్తి గీతాలు కూడా ఎన్నో రాశారు.170 పాటలు రాసిన కృష్ణశాస్త్రి గారు భక్త ప్రహ్లాద సినిమా పాటలు ఎంపికలో 400 మంది కవులతో పోటీపడి నిలిచిన 12 మందిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒకరుగా నిలవడం ఎంతో విశేషముగా చెప్పవచ్చు.

1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ 1978లో సాహిత్య అకాడమీ అవార్డు 1976 లో పద్మ భూషణ్ అవార్డులో అందుకొని అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి

గొప్ప రచయితగా భావకవుల ప్రతినిధిగా పేరుగాంచిన కృష్ణశాస్త్రి 1963 లో అనారోగ్య కారణంగా మూగబోయినా………కానీ ఆయన రచన పరంపర కొనసాగింది.

మరణం
1980ఫిబ్రవరి, 24న కృష్ణశాస్త్రి గారు మరణించారు.
ఆ గొంతు మూగబోయినా….
నాటి నుండి నేటి వరకు ప్రతి గొంతులో ఆయన సాహిత్యం ఊపిరిపోసుకుంటూనే ఉంది.

chatgpt image jun 1, 2026, 11 30 23 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *