mondya poem thumb.jpg

నేనే రాజు.. నేనే మంత్రి

Spread the love

నేనే రాజు.. నేనే మంత్రి

బోర భారతీదేవి
S. A(తెలుగు) విశాఖపట్నం
9290946292

అంశం:జీవితం
వచన ప్రక్రియ

కష్ట సుఖాల
కన్నీటి సంద్రాన

కాలం పరుగులు
కాసులు కవ్వింపులు
కనిపించని కాకి లెక్కలు
కోరుకున్న కీర్తి కిరీటాలు

అదుపు ఆజ్ఞలు
ఆంక్షల తీరాలు
ఆత్మీయ స్పర్శలు
ఆత్మ ఆభిమానాలు

ఆశల వెక్కిరింతలు
అరణ్య రోదనలు
అవ్యక్తపు భావాలు
అపురూప క్షణాలు

మానసిక ఘర్షణలు
మౌన పోరాటాలు
ముళ్ళ కిరీటాలు
మరణ మృదంగాలు

రుతు రాగాలు
రుణ పాశాలు
రణ రంగాలు
రాజీ మార్గాలు

మలకువతో మెసిలి
మలిచే ప్రతిమలుపు
మల్లెల పరిమళాలు
మధురానుభూతులు

ఎన్నో మరెన్నో
అడుగడుగునా …
ఆటుపోట్లు ఎన్నున్నా…
నా జీవిత కథలో
నేనే రాజు నేనే మంత్రి

1 thought on “నేనే రాజు.. నేనే మంత్రి”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *