Sing Geetham Release Postponed I రిలీజ్‌కు ముందే ట్విస్ట్..
Sing Geetham Release Postponed I ఒక్కరోజు వాయిదా పడిన ‘సింగ్ గీతం’
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ రిలీజ్ విషయంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. పాటల ద్వారానే పాత్రలు సంభాషించే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మ్యూజికల్ ఫిల్మ్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజా అప్డేట్ ప్రకారం సినిమా విడుదలను ఒక రోజు వాయిదా వేశారు. దీంతో ‘సింగ్ గీతం’ జూన్ 12న థియేటర్లలోకి రానుంది. వాయిదాకు గల కారణాన్ని మేకర్స్ వెల్లడించలేదు.
నాగ్ అశ్విన్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ లభించింది. అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
CLICK HERE FOR READ MORE : కథ ముందే చెప్పడం వెనుక రాజమౌళి సక్సెస్ ఫార్ములా ఇదేనా?



