Nikhil Siddhartha

Nikhil Siddhartha | విద్యార్థుల విద్యకు నిఖిల్ చేయూత..

Spread the love

Nikhil Siddhartha | వెయ్యి మంది చిన్నారులకు స్కూల్ కిట్ల పంపిణీ


యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,000 మంది విద్యార్థులకు విద్యా సామగ్రితో కూడిన స్కూల్ కిట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, స్టేషనరీతో పాటు విద్యార్థులకు అవసరమైన ఇతర వస్తువులు కూడా పంపిణీ చేశారు. ‘రక్షాదళ్’ మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.

Nikhil Siddhartha | ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన నిఖిల్, చదువు జీవితంలో అత్యంత విలువైన సంపద అని అన్నారు. పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడి చదవాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల ఎల్లప్పుడూ గౌరవ భావంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు.

నిఖిల్ చేతుల మీదుగా స్కూల్ కిట్లు అందుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు, తల్లిదండ్రులు అభినందిస్తూ, విద్యార్థులకు ప్రోత్సాహం అందించే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.

Nikhil Siddhartha |

CLICK HERE TO READ MORE: హీరోలకు 7వ సినిమా సెంటిమెంట్.. అఖిల్‌కు ‘లెనిన్’ కలిసొస్తుందా?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *