Irumudi2026: సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడి మదిలో మెదిలిన ప్రశ్నలివే!
Irumudi2026: కథలోని లోపాలు, విచిత్రమైన సన్నివేశాలపై ఆసక్తికరమైన ప్రశ్నలు
ఇరుముడి..ఈ సినిమా కి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారో తెలియడం లేదు..
కూతురు సినిమా మొదట్లో తండ్రికి తాగమని ఎంకరేజ్ చేస్తుంది🤣..
తరువాత అదే కూతురు..నాన్న తాగుడు మానెయ్య వచ్చు కదా నాన్న అనగానే హీరో మానేయడం 😂😂
ఇక మరో విషయం..
ఊర్లో ఎన్ని మర్డర్ లు జరుగుతున్నా..పోలీసు లు మచ్చుకి కూడా కనపడరు😂😂..ఇది మరీ విడ్డూరం😂😂
ఇక మరో విషయం..
నాగులు పాత్ర చనిపోతే..హీరో చేశాడు అని నాగులు తండ్రి పోలీసులకి కంప్లైంట్ కూడా చెయ్యడు..అదేం విచిత్రం నో 😂😂
ఇక మరో విషయం..
ఆ స్కూల్లో విలన్ టీచర్ తప్పితే మిగిలిన టీచర్స్ అసలు ఉన్నారో లేరో కూడా అర్ధం కాదు😂😂
ఇక విలన్ టీచర్..స్కూల్లో ఆడపిల్లలను తార్చు తూ..ఉంటే ఇంట్లో ఒక్కరూ చెప్పరు?? అదేంటో టపా టపా ఆత్మహత్యలు మాత్రం చేసుకొంటూ ఉంటారు🤣🤣 పేరెంట్స్ కి చెప్పరు కానీ అమాయక 10 సంవత్సరాల పాప కి మాత్రం మొత్తం చెప్పేస్తారు 😂😂..ఆ పాప కి అర్ధం కాకపోయినా … అంతా అర్ధం అయినట్టు..ఎవ్వరికీ చెప్పకుండా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది😂😂
ఇక మరో విషయం ..
సాయి కుమార్ అసలు.. అంత సౌమ్యుడు గా ఉంటూ …కూతురుకి అంత అన్యాయం చేస్తే బాధ పడాల్సింది పోయి..పసి పాప ను చంపేస్తే ప్రాబ్లం తీరు తుంది అనుకోవడం..అస్సలు అర్ధం కాలేదు..
సాయి కుమారు కూతురు కేవలం హాల్ టిక్కెట్ ఇవ్వను అని భయపడితే నే వేరే వాళ్ళ పక్క లోకి ఎలా ఒప్పుకుంటారు అనుకున్నాడో ఆ డైరెక్టర్ కే తెలియాలి🙏.
ఇక మరో విషయం 😂😂..
హీరో అడగ గానే..అర్ధరాత్రి బాధిత ఆడపిల్లలు అందరూ హీరో తో వేరే ఊరు వెళ్ళి అన్యాయం మీద పోరాటం చెయ్యడం..ఇది మరీ విచ్చిత్రం గా ఉంది😂😂😂..మరి ఆ ఫ్యామిలీ ల లో కూతురు అర్ధరాత్రి ఎందుకు వెళుతున్నావ్ ఎక్కడ కి వెళుతున్నావ్ అని అడగలేదా??..
ఇక చివరి విషయం..
అసలు పోరాటం చేయవలసింది..టీచర్స్ కాదు.. MLA లు 🤣
మమ్మల్ని ఇంత చీప్ గా చూపిస్తారా అని😂😂.
మళ్ళీ ఆ పాప చనిపోతే ..ఆ గ్రామం అసలే బస్ సర్వీస్ కూడా లేని గ్రామం లో వేల మంది జనం పొగవుతారు..అంతిమ యాత్ర లో పాల్గొంటారు.. 😥😥ఇది మన రాజకీయ పార్టీ మీటింగ్ లకు జనాల్ని గ్రాఫిక్స్ లో చూపిన విధంగా ఉంది🙏🙏🙏

నాకో అనుమానం
నేను చూసిన సినిమా హాల్లో వేసిన ఇరుముడి లోనే ఇన్ని లోపాలు ఉన్నాయా…లేక మిగతా థియేటర్లు లో కూడా ఇవే సీన్లు ఉన్నాయా??
లేదా నేను చూసిన దృష్టి కోణం లో ఏదైనా తప్పు ఉందా🤣🤣
డప్పు శ్రీను గత 25 సం.లు గా ఆ పాట పాడుతూనే ఉన్నాడు..ఇప్పటికీ..ఎప్పటికీ అయ్యప్ప భజనల్లో ఆ పాట ఎవర్ గ్రీన్ ❤️..
ఆ పాట కోసం ఇన్ని తప్పులున్న సినిమాని సూపర్ ఎలా చేశారో అర్థం కావడం లేదు🙏🙏🙏



