sahityam1

నా పేరు ధరిత్రి

నా పేరు ధరిత్రి…చదువు సంధ్యల్లోనూ-పేరు ప్రతిష్టల్లోనూ ధరిత్రి అంత ఎదిగి , చరిత్రలో నిలిచి పోవాలనేమో -మా అమ్మా నాన్నా నాకీ పేరు పెట్టారు. కానీ కారు చీకటిలో కూరుకు పోయి నరకయాతన అనుభవిస్తున్న నా జీవితం ప్రతి ఆడపిల్లకూ ఓ హెచ్చరిక కావాలి. అంతకంటే ఇంక కోరుకోవడానికి నాకింకేం మిగిలిందని ?

………………………………………………………………………………………………………………………………………….

మాదొక చిన్న పల్లెటూరు . ఏరోజుకారోజు పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి మాది . నాన్న ఇంట్లోనే  చిన్న కిరణా షాపు నడిపేవారు . అమ్మ అందులోనే ఓ పక్కన మెషిను పైన బట్టలు కుట్టేది . నేనొక్కదాన్నే సంతానం , ఉన్న ఊళ్ళోనే హై స్కూల్ చదువు పూర్తి చేశాను . ఆ తర్వాత మా ఊళ్లోనే జూనియర్ కాలేజ్ రావడం  వల్ల ఇంటర్  రెండేళ్ళు ఊళ్ళోనే గడిచిపోయింది అందరితో కలిసి హయిగా ఆడుతూ పాడుతూ కాలి నడకన కాలేజీకి వెళ్లి రావాలని నాకెంతో ఆశగా ఉండేది . కానీ నాన్న స్వయంగా తీసుకెళ్లి సైకిలు మీద దింపి ,  కాలేజీ అయిపోయే సమయానికి వచ్చి ఇంటికి తీసుకొచ్చేవారు నాకది అస్సలు నచ్చేది కాదు . అమ్మేమో కాలేజీలో స్నేహితుల గురించి గుచ్చి గుచ్చి అడిగేది . కాలేజీ వదిలాక అందరితో బాటు సరదాగా పానీ పురీ తినాలనీ క్లాసులు బోర్ గా అనిపించినపుడు ఏ సినిమాకో చెక్కెయాలనీ ఎన్నో సార్లనిపించేది . కానీ, నాన్న భయానికి అలాంటి కోరికలను అణిచేసుకునేదాన్ని . ఏ స్నేహం ఎటు దారి తీస్తుందో – ఏ ఆపద తీసుకొస్తుందోనని అమ్మనాన్నా అంటుండేవారు. ఆర్థిక బలహీనత వారి భయానికి కారణమై ఉంటుంది . ఇంటర్ పూర్తయ్యాక ఇక చదువే వద్దన్నారు . తగిన స్థోమత లేదన్నారు . కానీ చదువుకుంటానన్న నా పట్టుదలకి తల వంచి పది కిలోమిటర్ల దూరంలో ఉన్న టౌనులోని డిగ్రి కాలేజీలో చేర్పించడానికి ఒప్పుకున్నారు .  కానీ అంత దూరం నాన్న సైకిల్ మిద దిగబెడితే మాత్రం కుదరదని చేప్పేశాను . ఎన్నో జగ్రత్తలు చెప్పి, బస్సులో వెళ్లి రావడానికి ఒప్పుకున్నారు . నేననుకున్న స్వేచ్చ నాకు లభించింది . విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లైంది . కొత్త కొత్త  మొహాలు – సరికొత్త స్నేహాలు…. రోజులు నిమిషాల్లా గడిచిపొతున్నాయి . అమ్మాయిలపై అబ్బయిల కామెంట్లు, అల్లరి చిరుకోపం కలిగించినా – గిలిగింతలు పెట్టేది . మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది . అందులో మోహన్ ని చూస్తే ఎదో అలజడి రేగేది . అతడి చుట్టూ చిన్న గ్యాంగ్ … స్పోర్ట్స్ బైక్ మీద ఫోజు పెట్టి కాలేజ్ గ్రౌండ్ లో కూర్చునుంటే అచ్చు హీరోలా అనిపించే వాడు … అతడితో మాట్లాడాలనీ, ఫ్రెండ్షిప్ చెయ్యాలనీ అమ్మాయిలకు ఆశగా ఉండేది . అలాంటి మోహన్ తో అనుకోకుండా మాట కలిసింది.. చూపు చిక్కుకుంది … అప్పుడప్పుడూ అతడి బైక్ వెనకాల కూర్చుని వాళ్ల గ్యాంగ్ తో కలిసి సినిమాలకి షికార్లకి తిరిగేంత చనువేర్పడింది .

ఒక రోజు మోహన్ గ్యాంగ్ లోని చందు కొత్త డ్రస్ వేసుకొచ్చాడు .. ” హాయ్ చందు .. వాట్ యార్ … ఏంటి విశేషం “అనడిగాను .. ” నీకు తెలీదా ? ఈ రోజు వాడి బర్త్ డే .. ” అన్నడు మోహన్ …

ఓ మెనీ మెనీ హాపీ రిటర్న్స్ ఆప్ ది డే …  మరి స్వీటేదీ ? అన్నా ….

 ” చిన్న స్వీటేంటీ ? ఏ రోజు గ్రాండ్ పార్టినే  అరెంజ్ చేస్తే … “

నవ్వుతూ అన్నడు చందు . అందరితో బాటు నేనూ రావాలని ఇన్వైట్ చేశడు . ఈవెనింగ్  అయితే నాకస్సలు కుదరదన్నాను – టైం కి ఇంటికెళ్లక పోతే నాన్న చంపేస్తాడని చెప్పాను . ” వి నో ప్రాబ్లం ధరిత్రీ అందుకే ఆఫ్టర్ నూన్ కేక్ కటింగ్, లంచ్ అరెంజ్ చేశాం – అదయిపోగానే మద్యాహ్నం మళ్లీ క్లాసులకొచ్చేయొచ్చు … “చెప్పారు …

కేకంటే నాకు చాలా ఇష్టం …. లెవన్ థర్టీకలా బయల్దేరాం.. మామూలేకదాని  కూర్చున్నాను – మరో రెండు బైకులు.. అందరూ అబ్బాయిలే … కాస్త భయమేసింది .. ఇంకెవ్వరూ రారా ? మనమేనా ? అనుమానంగా అడిగా … అదేంటి ధరిత్రి అలా అడుగుతావు ? అందరం ఒకే సారి వెళితే సర్స్ ఎవరైనా ఊరుకుంటారా ? అన్నాడు మోహన్ … లంచ్ కల్లా వచ్చి జాయినవుతారులే ” అన్నాడు చందు . హైవే మీద బైకులు పరుగు తీశాయి . పార్టీ ఎక్కడ అరెంజ్ చేశారు మోహన్ ? ” దార్లో అడిగను … జస్ట్ త్రీ కిలో మీటర్స్ అవతల రమేష్ వాళ్ల అంకుల్ ఫాంహౌజ్ లో… సూపర్బ్ గా  ఉంటుంది అట్మాస్ఫేర్ … అన్నాడు మోహన్ … మాటల్లో ఉండగానే బైకులు హైవే మీద నుండి చెట్ల మధ్య నుండి సన్నని కాలిబాట దాటుకుంటూ ఇరుకైన దారిలోకి ప్రవేశించాయి ….. రాంగోపాల్ వర్మ సినిమాల్లోలా ఉందా ఫామ్ హౌజ్ … కొంత గుండె ఝల్లుమన్నా – పార్టీ సందడి బెలూన్లూ అనీ చూసేసరికి ఉత్సాహంగా అనిపించింది …. ఆ ఉత్సాహం ఆవిరై పోవడానికి ఎంతో సమయం పట్టలేదు ……. ఎంతసేపైనా ఎవరూ రాకపోడంతో –  కేక్ కటింగ్ లంచ్ కానిచ్చేసి మనమే కాలేజ్ కెళ్లిపోదామని అనుకున్నాం…  అందరికీ డ్రింక్స్ సర్వ్ చేశాడు రమేష్ …గటగటా తాగేశాను …. కళ్లు గిర్రున తిరిగినట్లయింది….మత్తు ఆవహించింది .. ఆ తర్వాతేమైందో తెలీదు …

………………………………………………………………………………………………..

బరువెక్కిన కళ్లు బలవంతంగా తేరిచే ప్రయత్నం చేశాను . సన్నగా ప్రసరిస్తోన్న వెలుగునే చుడలేక మూతబడుతున్నాయి … స్వాధీనం లేని ఒళ్లు కదలడానికి సహకరించడంలేదు ….. కడుపులో మెలిపెట్టి తిప్పుతున్న బాధ …. నేనెక్కడున్నానో నాకే తెలీడం లేదు ….. మంచం మీద నిస్త్రాణంగా పడి ఉన్నానని గ్రహించగానే అప్రయత్నంగా ఒకే ఒక్క పొలికేక నా గొంతు చీల్చుకుంటూ వచ్చింది ….. 

బయటి గదిలో వినిపిస్తున్న మాటల శబ్ధం ఆగిపోయింది. చిన్నగా తలుపు తెరుచుకుని ఓ ఆకారం లోపలికొచ్చింది .

 మో……….హ………..న్……….

ఏదో ఘాటు వాసన…. అతడినుంచి…అతడి కళ్లు అదోలా ఉన్నయి … కలిసి చదువుకునే వాడే అయినా…. చనువున్న స్నేహితుడే అయినా – అతడు ఒక్కో అడుగు నా వైపు వేసి సమీపిస్తుంటే ఎందుకో చిగురుటాకులా కంపించింది నా శరీరం …. శక్తి కూడ గట్టుకుని దుప్పటి పైకి లాక్కున్నాను …పక్కనొచ్చి కూర్చున్నడు .. “సారీ ధరిత్రీ….. నీ అందం నన్ను పిచ్చి వాణ్ణి చేసింది … అన్నిటికీ తెగించి అందుకునేలా ప్రేరేపించింది … అలా జరిగిపోయింది …… అయినా ఇప్పుడు  మించి పోయిందేమీ లేదు…లేచి ఫ్రెష్ అవ్వు మాములుగా కాలేజ్ కెళ్లిపోదాం … ఎవరి క్లాసుకు వాళ్లు వెళ్లి పోవచ్చు …. రేప్పొద్దున పిల్స్ తెచ్చిస్తాను వాడుకో.. ఫినిష్ ..ఏమవదు “

స్థాణువైపోయాను ……. అంతలోనే కట్టలు తెంచుకున్న ఆవేశంతో కాలరు పట్టుకునాను “దుర్మర్గుడా…. నిన్నేం చేస్తానో చూడు … ప్రిన్సిపల్ కి కంప్లెంట్ చేస్తా …..నిన్ను డిబార్ చేయిస్తా …..నా లైఫ్ తో ఆడుకునే హక్కు నీకెవరిచార్రా ? నీ లైఫ్ స్పాయిల్ చేస్తా …” గట్టిగా అరిచాను …. రెచ్చిపోయి తిరగబడతాడన్నుకున్నా.. కూల్ గా జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు ….

ఏదొ వీడియో ఆన్ చేసి – నావైపు చుపించాడు …. ఏదో బ్లూఫిలింలా ఉంది …. ఒక అమ్మాయి …వరుసగా ఒకరి తర్వాత మరొకరు …. ఆ అమ్మాయి  నేనేననీ, వాళ్లు మోహన్ , చందు, రమేష్ లనీ గుర్తించడానికి సెకన్ల కంటే ఎక్కువ టైం పట్టలేదు …. భుమంతా గిర్రున తిరిగినట్టు … నేనెక్కడో అగాధంలోకి జారి పోతున్నట్టు … 

” నువ్వన్నవన్ని చేస్తే , స్పాయిల్ అయ్యేది నా లైఫ్ కాదు ధరిత్రీ , నీది …. ఈ విడియో ఫేస్ బుక్ లో షేర్ చేస్తే బోల్డన్ని లైకులొస్తాయి … ” మెత్తగా… క్రూరంగా అన్నాడా నీచుడు …. వీళ్లనా స్నేహితులని నమ్మింది …. నాన్న కళ్లు గప్పి నేను కావాలనుకున్న స్వచ్చ ఫలితం ఇంత ఘోరంగా ఉంటుందా ? ” నా మనసు భోరున విలపిస్తోంది …. ” ఇందాక అన్ కాన్షియస్ లో ఉండి బోల్డంత ఎంజాయ్ మెంట్ మిస్సయ్యావు తెలుసా ? ” అంటూ తలుపు గడియ పెట్టి వచ్చాడు…. ప్రతిఘటించలేని నా శరీరం సహకరించక తప్పలేదు ….

     …….                                ………..                                      …….

ఆ నరకం నుంచి బయటపడి ఇంటికెలా చేరుకున్నానో తెలియదు …. మర్నాడు తీవ్రమైన జ్వరంతో కాలేజీ కెళ్లలేక పోయాను. ఇంటి దగ్గరుండే క్లినిక్ కి తీస్కెళ్లి ఇంజక్షన్ ఇప్పించారు అమ్మా నాన్నా……. జ్వరం తగ్గినా – మనసలోని బాధ, మళ్లీ కాలేజ్ కెలా వెళ్ళాలన్న భయం – ఎవరితో చెప్పకుంటే తీరుతుందో అర్థం కాలేదు ….

    …….                                ………..                                      …….

 కాలేజ్ ఆవరణలో అడుగుపెడుతునే కనిపించాయి ఆ మానవ మ్రుగాలు … ఏమి జరగనట్టు …… నేనెవరో తెలీనట్టు నావైపే చూడలేదు …… అయినా నా మనసేదో కీడు శంకించడం మానలేదు ….. లంచ్ అవర్ లో మోహన్ నా దగ్గరకొచ్చి మెల్లిగా …”ధరిత్రి నీతో కాస్త మాట్లాడాలి …” అన్నాడు … చివ్వున తలెత్తి చుశాను …. ” ప్లీజ్ అలా  చూడకు … అలా బైటికెళ్దాం పద …” అరిస్తే ఏమవుతుందో తెలుసు కనుక అతడితో మౌనంగా నడిచాను …. బైక్ స్టార్ట్ చేసి కూర్చోమని సైగ చేశాడు …. అదే ఫాం హౌజ్ … స్పిడ్ గా … తీసుకెళ్లి ఆపాడు ….. లాక్ తీసి లోపలికెళ్లాడు  …. భయం భయంగా బయిటే నిలుచ్చున్నాను ” పర్లేదు, రా !… ఏం జరగదు … ఈ పిల్స్ ఇవ్వడానికని తీసుకొచ్చా … వేసుకోగానే ప్రాబ్లెం కదానీ … “అంటూ టాబ్లెట్స్ చూపించాడు …. అప్రయత్నంగా  లోపలికి నడిచాను …. తనే ఫ్రిజ్ లోంచి మంచినీళ్లు తీసిచ్చాడు నేను అనుమానంగా చుస్తుంటే …. గటగటా తనే కొన్ని తాగి మిగిలినవి నాకిచ్చాడు. మళ్లీ ఫ్రిజ్ లోంచి యాపిల్స్ తీసి … ముక్కలు చేసి తెచ్చిచ్చి  . ” పర్లేదు తిను …. మరీ వీకై పోతావు ” అన్నాడు .. అవి తిన్నాక తలుపు గడియ వేసొచ్చి …… కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం …. క్లాసుల కింకా టైం వుందిలే అంటూ దగ్గరకొచ్చాడు ……..

వాళ్లది చాలా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అనీ, వాళ్ల నాన్నకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందనీ అందరూ చెప్పుకోగా విన్నాను …. అయితే ఇది వాళ్ల ఫాం హౌజేనన్నమాట …. మై గాడ్.. మోహన్ ఇంత విలనా …. శాడిస్టా …… ఈ వయసుకే డ్రింక్.. అమ్మాయిలా … అంటే నా కథ ఇంతటితో అయిపోలేదు ….. ఇంకా నేనతడికి ఎంత కావాలంటే అంత ఒదిగి పోవాలన్నమాట …. పర్యవసానమేదైనా బలయ్యేది నేనే ….

డ్రింక్ చేసాడేమో గుర్రు పెడుతూ సోఫాలో పడి పోయిన మోహన్ ని చూస్తుంటే నా మనసు మౌనంగా ఘోషిస్తూ పరిపరి విధాల ఆలోచిస్తోంది ……

ఇక ఎవ్వరికీ నా మొహం చూపించలేను….. నా దారి నేను చూసుకోవాలి. ఇక్కణ్ణుంచి బయిట పడాలి …… తలుపు తీసుకుని బయటకొచ్చాను ….. హైవే మీదకు చేరుకుని వచ్చే లారీనేదో చెయ్యెత్తి ఆపి ఎక్కేశాను.

***********

ఎన్నెన్నో మలుపులు తిరిగి ఏ ఆడపిల్లా అనుభవించని దారుణాల బారిన పడి ఇక్కడికి చేరింది నా బ్రతుకు. ఇదెక్కడో తెలీదు. భాష రాదు. ఈపాటికి అమ్మానాన్నా కంట్లో నీరు ఇంకిపోయేదాకా ఏడ్చి ఉంటారు. ఒంట్లో ఓపిక లేకపోయేదాకా ఎదురు చూసుంటారు. ఆ తర్వాత….? ఆలోచించడానికే ధైర్యం చాలదు….

ఎవరెవరో వస్తూంటారు. వాళ్ళ వికారాలు తీర్చుకుని వెళ్తూంటారు. అలసిన శరీరాన్ని కనికరించేవారే ఉండరు…. మనసులోని బాధను పట్టించుకునే వారుండరు. ఏడ్చి ఏడ్చి చారికలు పడిన మొహానికి పౌడర్లు రాసుకుని మళ్ళీ మళ్ళీ తయారవ్వాల్సిందే…. అమ్మా….నాన్నా….ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలనుంది. కనీసం మీగొంతు వినాలనుంది….మీ క్షేమ సమాచారం తెలుసుకోవాలనుంది……ఎక్కడున్నారు…..ఎలా వున్నారు? అసలున్నారా, లేదా….మీ దగ్గర కొచ్చేయాలనుంది….మీ ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోవాలనుంది…..అలా కాని పక్షంలో శాశ్వతంగా నిద్రపోయి ఈ నరకం నుండి విముక్తైనా పొందాలనుంది……   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *