google-site-verification: googlee1f767d3d556c059.html

“ఆ ఒక్క ప్రకటన అమృతారావు జీవితాన్నే మార్చేసింది!”

Spread the love

“ఆ ఒక్క ప్రకటన అమృతారావు జీవితాన్నే మార్చేసింది!”

కెమెరా ముందు సిగ్గుపడిన అమ్మాయి… ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఎలా అయింది?

బాలీవుడ్‌లో ఒకప్పుడు “గర్ల్ నెక్స్ట్ డోర్” ఇమేజ్‌కు అసలైన నిర్వచనం అమృతా రావే. పెద్దగా గ్లామర్ షోలు లేకుండా, ఓవర్ స్టైల్ లేకుండా… సింపుల్ నవ్వుతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్. “ఇష్క్ విశ్క్”, “వివాహ్” సినిమాల తర్వాత అయితే కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకుల్లో ఆమె నటనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. కానీ ఆమె గురించి చాలామందికి తెలియని ఆసక్తి కరమైన విషయం ఒకటుంది. అదేమిటంటే…కెరీర్ ప్రారంభంలో అమృతా రావు కెమెరా ముందు నిలబడటానికే భయపడేది. అవును…అంతే కాదు…అసలు ఆమె సినీ ప్రయాణం కూడా చాలా అనుకోకుండా ఆసక్తికరంగానే మొదలైంది.

 

కాలేజీ రోజుల్లో అమృతా చాలా సైలెంట్ అమ్మాయి. ఫ్యాషన్ షోలు, పార్టీల కన్నా ఇంట్లో పుస్తకాలు చదవడం, ఫ్యామిలీతో టైమ్ గడపడం ఎక్కువ ఇష్టమట. ఒకసారి ఆమె ఫోటోలు చూసిన ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, మోడలింగ్ కోసం సంప్రదించిందట. మొదట ఆమె నేరుగా “నాకు ఇంట్రెస్ట్ లేదు” అని చెప్పేసిందట. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒప్పించడంతో చివరకు ఒక ప్రకటన షూట్‌కి వెళ్లింది.

 

అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన రోజు.

 

అక్కడి దాకా వెళ్ళనైతే వెళ్ళింది కానీ, ఆ యాడ్ షూట్‌లో కెమెరా ముందు అమృతా చాలా టెన్షన్ పడిందట. డైరెక్టర్ చెప్పిన డైలాగ్ చెప్పేటప్పుడు పదే పదే నవ్వేసేది. డైరెక్టర్ చెప్పిన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేక మళ్లీ మళ్లీ టేక్స్ తీసుకున్నారట. కానీ షూటింగ్ ముగిసే సమయానికి ఆమె సహజమైన నవ్వు, అమాయకమైన ముఖాభినయం యాడ్ మేకర్స్‌కు బాగా నచ్చింది.

13

 

ఆ ప్రకటన టీవీలో ప్రసారం అయిన కొద్ది రోజుల్లోనే అమృతారావుకు వరుస ఆఫర్లు రావడం మొదలైంది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. మొదట వచ్చిన కొన్ని సినిమా అవకాశాలను ఆమె తిరస్కరించింది. ఎందుకంటే… గ్లామర్ పాత్రలు చేయడం తనకు కంఫర్ట్‌గా అనిపించలేదని. అదే సమయంలో “ఇష్క్ విష్క్” కథ వినగానే మాత్రం వెంటనే ఒప్పుకుంది. ఎందుకంటే ఆ సినిమాలోని అమ్మాయి పాత్ర తన నిజజీవితానికి దగ్గరగా అనిపించడమే కారణం.

 

ఇష్క్ విష్క్ సినిమా విడుదలైన తర్వాత కాలేజీ యువతలో అమృతారావు ఒక్కసారిగా క్రేజ్ సంపాదించింది. కానీ ఆమెకు అసలైన మలుపు ఇచ్చింది “వివాహ్” సినిమా. ఆ మూవీలో ఆమె నటన చూసి చాలా మంది ప్రేక్షకులు “ఇలాంటివాళ్లే నిజ జీవితంలో కోడలిగా రావాలి” అనేంత స్థాయిలో అభిమానించారు. ముఖ్యంగా కుటుంబ తరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

 

ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే… అమృతారావు నిజ జీవితంలో కూడా చాలా సింపుల్‌గా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. పెద్ద పార్టీలు, హడావుడి కన్నా ఇంట్లో ఫ్యామిలీతో గడపడం, పుస్తకాలు చదవడం ఆమెకు ఇప్పటికీ ఇష్టమట. షూటింగ్ సెట్స్‌లో కూడా ఎక్కువగా తనలో తానే ఉండడం ఆమె స్వభావం. కానీ కెమెరా ఆన్ అయితే మాత్రం పూర్తిగా పాత్రలోకి వెళ్లిపోతుందని దర్శకుల అభిప్రాయం.

 

ఒకసారి ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట ఇప్పటికీ అభిమానులకు గుర్తుంది — “స్టార్ అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీలోకి రాలేదు. కానీ ప్రేక్షకులు పంచిన ప్రేమవల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను.”

 

బహుశా అదే అమృతారావు ప్రత్యేకత కావచ్చు. గ్లామర్ కన్నా సహజత్వంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్‌గా ఆమె ఇప్పటికీ గుర్తుండిపోవడానికి అదే కారణం.

ఈరోజు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న అమృతారావుకు ట్రెండీ దునియా.కాం శుభాభినందనలు తెలియజేస్తోంది.

14

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *