google-site-verification: googlee1f767d3d556c059.html
whatsapp image 2026 06 01 at 02.26.31 (5)

ఫ్రిజ్‌లో ఏవి పెట్టాలి? ఏవి పెట్టకూడదు? ఆరోగ్యానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Spread the love

ఫ్రిజ్‌లో ఏవి పెట్టాలి? ఏవి పెట్టకూడదు? ఆరోగ్యానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహార పదార్థాలు

రాత్రి 11 గంటలు…
భోజనం అయిపోయింది. మిగిలిన కర్రీలన్నీ డబ్బాల్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టేశారు. వాటి పక్కనే నిన్నటి పిజ్జా బాక్స్, దాని మూడు రోజుల క్రితం చేసిన చికెన్, సగం కట్ చేసిన పాల ప్యాకెట్ అలాంటిదే మరో కవర్ అందులో పెరుగు… కట్ చేసిన మామిడి, ఆపిల్, పండ్లు… ఇలా ఒక్కో షెల్ఫ్ ఒక్కో కథ చెబుతోంది.
“ఫ్రిజ్‌లో పెట్టాం కదా… ఇంకేం టెన్షన్?” అని చాలామంది అనుకుంటారు. కానీ నిజంగా ఫ్రిజ్ అన్నది “అన్నింటినీ ఎప్పటికీ కాపాడే మ్యాజిక్ బాక్స్” నా?

ఆహార భద్రతానిపుణులు చెబుతున్నదేమిటంటే… ఫ్రిజ్ ఆహారం పాడయ్యే వేగాన్ని కొంతవరకు మాత్రమే తగ్గిస్తుంది గానీ, పూర్తిగా పాడవకుండా మాత్రం ఆపదు. అంతేకాదు… కొన్ని వస్తువులను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని రుచి, గుణాలు, పోషకాలు చాలావరకు తగ్గిపోవచ్చు. వాటిని తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.

అసలు ఏమేం పెట్టొచ్చు? ఎంతకాలం నిల్వ ఉంచొచ్చు? ఇప్పుడు చూద్దాం. మొదటగా… టమోటాలు. చాలామంది టమోటాలను ఫ్రిజ్‌లో పెడతారు. కానీ చల్లటి ఉష్ణోగ్రత వల్ల వాటి సహజ రుచి, టెక్స్చర్ దెబ్బతింటుందని ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అలాగే బంగాళా దుంపలను ఫ్రిజ్‌లో పెడితే అందులోని స్టార్చ్ వేగంగా చక్కెరగా మారి రుచి మారిపోతుంది.

ఉల్లిపాయలు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. తేమ కారణంగా అవి త్వరగా మెత్తబడి పోవచ్చు లేదా పుచ్చిపోవచ్చు. అయితే కట్ చేసిన ఉల్లిపాయలను మాత్రం గాలి చొరబడని డబ్బాలో కొద్దిసేపు ఉంచవచ్చు.

అరటి పండ్లు ఫ్రిజ్‌లో పెడితే తొక్క త్వరగా నల్లబడుతుంది. తేనెను ఫ్రిజ్‌లో ఉంచితే అది గట్టిపడే అవకాశం ఉంది. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల త్వరగా ఎండి పోయి దాని రుచి చాలావరకు తగ్గిపోతుంది.

మరి ఏవి తప్పనిసరిగా ఫ్రిజ్‌లో పెట్టాలి?
పాలు, పెరుగు, వెన్న, పనీర్‌, వండిన ఆహారం, మాంసాహారం, కట్ చేసిన పండ్లు, కొన్ని ఆకుకూరలు తప్పనిసరిగా చల్లటి ఉష్ణోగ్రతలోనే భద్రపరచాలి. ముఖ్యంగా వండిన ఆహారాన్ని బయట ఎక్కువ సేపు ఉంచడం ప్రమాదకరం. అందులోని బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే ఫ్రిజ్‌లో పెట్టామంటే ఇక ఎన్ని రోజులైనా వాడొచ్చనుకోవడం మాత్రం పెద్ద తప్పు. అమెరికా ఎఫ్.డీ.ఏ ఫుడ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారం…

వండిన కర్రీలు ఫ్రిజ్ లో దాచినవి సాధారణంగా 2–3 రోజుల్లో వాడేయాలి.
పాలు ప్యాకెట్ తెరిచిన తర్వాత కొన్ని రోజుల్లోనే ముగించాలి.
కట్ చేసిన పండ్లు ఎంత ఫ్రిజ్ లోనైనా ఎక్కువ సేపు నిల్వ చేయకూడదు.
ఫ్రిజ్‌లో వేటివల్లనైనా దుర్వాసన వస్తే మాత్రం ఏమాత్రం ఆల్సయం, అలక్ష్యం చేయకుండా వెంటనే శుభ్రం చేసేయాలి.

మరో ముఖ్యమైన విషయం… వేడిగా ఉన్న ఆహారాన్ని నేరుగా ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దీంతో ఫ్రిజ్‌లోని మొత్తం ఉష్ణోగ్రత పెరిగుతుంది. ఆ ఉష్ణోగ్రతను చల్లబరచడానికి కంప్రెసర్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ శీతోష్ణస్థితుల హెచ్చు తగ్గుల ప్రభావం మిగతా ఆహారంపైనా పడుతుంది. అలాగే ఫ్రిజ్‌ను అతిగా నింపేయడం వల్ల చల్లని గాలి సరిగా తిరగదు.

ఫ్రిజ్ మనకు ఎంతో ఉపయోగకరమైన పరికరమే. కానీ ఏది పడితే అది పెట్టేసే స్టోర్‌ రూమ్ కాదు. సరైన విధంగా వాడితేనే ఆహారం తాజాగా ఉంటుంది… ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుంది.

chatgpt image may 24, 2026, 11 18 00 am

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *