chatgpt image may 31, 2026, 10 47 14 pm

అమ్మానాన్నలు, పిల్లలు… మధ్యలో స్మార్ట్‌ఫోన్: మారిపోతున్న కుటుంబ బంధాల కథ

అమ్మానాన్నలు, పిల్లలు… మధ్యలో స్మార్ట్‌ఫోన్: మారిపోతున్న కుటుంబ బంధాల కథ

ఒకే టేబుల్‌పై కూర్చున్నా దూరమవుతున్న కుటుంబాలు

మొన్న ఒకరోజు హోటల్‌కి వెళ్తే అక్కడొక దృశ్యం కనిపించింది. ఓ ఫ్యామిలీ డిన్నర్‌కి వచ్చారు. నలుగురి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి. ఆర్డర్ ఇచ్చే దాకా ఎవరి లోకంలో వారు బిజీ. అంటే.. ఒకే టేబుల్ మీద ఉన్నా, వారు మాత్రం ఒకరికొకరు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది.. మన చిన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారిపోయింది? అని.

whatsapp image 2026 05 11 at 09.37.38

అప్పటి భయం.. ఇప్పటి భేషజం!

నిజం చెప్పాలంటే, ఓ రెండు మూడు దశాబ్దాల కిందట ‘నాన్న’ అంటే ఇంట్లో ఒక భయం ఉండేది. ఆయన వాయిస్ వినపడితే చాలు, వీధిలో ఆడుకునే పిల్లలం కూడా పరుగున వచ్చి పుస్తకాలు పట్టేసి సైలెంట్ అయిపోయేవాళ్ళం. అంటే అది భయం మాత్రమే కాదు, ఒక రకమైన గౌరవం. అప్పట్లో మనకు ఏది కావాలో అమ్మనాన్నలే నిర్ణయించేవారు. మనకంటూ ప్రత్యేకమైన ఇష్టాయిష్టాలు ఉంటాయని కూడా వాళ్లకు అనిపించేది కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ఎవరింట్లోనైనా ఇంతే..పిల్లల ఇష్టమే ఫైనల్. పిల్లలేమో ‘మాకు అన్నీ తెలుసు’ అనే భేషజంలో ఉంటున్నారు, తల్లిదండ్రులు మేం గట్టిగా మందలిస్తే, కోప్పడితే, ‘పిల్లలు ఏమైనా అనుకుంటారేమో’ అని భయపడి సర్దుకుపోతున్నారు.

పిల్లలదే రాజ్యం.

మరి తల్లిదండ్రులు-పిల్లల మధ్య ప్రేమ ఉందా? వస్తువులు ఉన్నాయా? అంటే, ఇప్పుడు అమ్మనాన్నలిద్దరూ బిజీ బిజీ. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీసు/బిజినెస్ టెన్షన్లు. ఆ బిజీలో పిల్లలకు టైమ్ ఇవ్వలేక పోతున్నామనే ఒక చిన్న ‘గిల్ట్'(తప్పు చేస్తున్నామనే భావన) వారిని వెంటాడుతోంది. అందుకే, ఆ గిల్ట్ నుంచి బయటపడటానికి పిల్లలు అడిగిన వెంటనే ఖరీదైన ఫోన్లు, ఐప్యాడ్‌లు కొనిస్తున్నారు. కానీ పిల్లలకి కావాల్సింది కొత్త మోడల్ ఫోన్ కాదు.. తల్లిదండ్రులత్తో కలిసి ఆడుకునే-మాట్లాడే ఒక గంట సమయం అని మనం మర్చిపోతున్నాం. అందుకే వాళ్లు కూడా మనుషుల కంటే వస్తువులకే ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు.

స్వేచ్ఛ ఓకే.. మరి బాధ్యత?

ఖచ్చితంగా ఇప్పటి జనరేషన్ పిల్లలు చాలా తెలివైన వాళ్లు. అందులో సందేహమే లేదు. వాళ్లకి లోకం గురించి, తమ భవిష్యత్తు గురించి, తమ కెరీర్ గురించి అద్భుతమైన అవగాహన ఉంది. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లల్ని కొట్టడం లేదు, బెదిరించడం లేదు.. స్నేహితుల్లా చూస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ మార్పు. కానీ ఇక్కడే ఒక చిన్న విషయం మిస్ అవుతోందేమో చూసుకోవాలి.. స్నేహం అంటే ‘ఏం చేసినా పర్లేదు’ అని కాదు. పిల్లలకు స్వేచ్ఛ ఇస్తూనే, దానికి తోడుగా ‘బాధ్యత‘ కూడా నేర్పించాలి. ఎదుటి మనుషులని ఎలా గౌరవించాలో చెప్పాలి.

నిన్నటి పెంపకంలో ఉన్న ‘కట్టుబాటు’, నేటి పెంపకంలో ఉన్న ‘స్వేచ్ఛ’.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఇప్పుడున్న పెద్ద సవాల్. పిల్లలకు గూగుల్ లో దొరకని కొన్ని విషయాలు ఉంటాయి.. అవే ‘అమ్మ ప్రేమ, నాన్న అనుభవం’. వాటిని వాళ్లకి పంచడంలో వెనకాడొద్దు. ఫోన్ పక్కన పెట్టి, వాళ్ల కళ్లలోకి చూస్తూ ఓ పది నిమిషాలు మాట్లాడితే చాలు.. ఆ బంధం మళ్ళీ చిగురిస్తుంది.

\

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *