google-site-verification: googlee1f767d3d556c059.html

కాకినాడ కాలేజీలో ‘మ్యాడ్ హీరో’ రామ్ నితిన్ సరికొత్త హంగామా!

Spread the love

కాకినాడ కాలేజీలో ‘మ్యాడ్ హీరో’ రామ్ నితిన్ సరికొత్త హంగామా!

వైరల్ అవుతున్న రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్

‘మ్యాడ్’ సినిమాతో థియేటర్లలో నవ్వుల రైలు పరిగెత్తించి, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంతెడ్ హీరో రామ్ నితిన్ ఇప్పుడు మరో పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. నిన్ననే (జూన్ 4న) ఈ ‘మ్యాడ్ హీరో’ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ ఒక క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కొత్త సినిమా పక్కా లోకల్ కాలేజ్ లవ్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కబోతోంది. ముఖ్యంగా కాకినాడలోని ఒక కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని టాక్ వినిపిస్తోంది. రిలీజ్ చేసిన బర్త్‌డే స్పెషల్ పోస్టర్ మొత్తం కలర్‌ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్‌తో నిండిపోయి ఆకట్టుకుంటోంది. ఇక పోస్టర్‌పై ఉన్న “ఫన్, ఫెస్ట్, కెయాస్.. బిగిన్స్ సూన్” అనే క్యాప్షన్ చూస్తుంటే, ఈసారి కాలేజీలో జరగబోయే రచ్చ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న గట్టి టీమ్ ఉంది. ‘సుందరకాండ’ సినిమాతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించిన వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి క్రేజీ సినిమాలను అందిస్తున్న సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని (ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్) వల్లభనేని గిరిబాబు సమర్పణలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వీరికి తోడుగా ‘యూత్’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన వినీత్, సందీప్ (E2C టాకీస్ బ్యానర్) ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తుండగా, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ సింజిత్ యెర్రమల్లి ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ అందించబోతున్నారు. ‘మ్యాడ్’ లో రామ్ నితిన్ చేసిన అలజడి మనకు తెలిసిందే, మరి ఈ సరికొత్త టీమ్‌తో కలిసి కాకినాడ కాలేజీలో ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ మరియు మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *