త్త గుణింతాక్షర పదాలతో బాలగేయం
గుణింతాక్షరాల అభ్యాసానికి అందమైన బాలగేయం
రచన;బోర భారతీదేవి స్కూల్ అసిస్టెంట్ తెలుగు
విశాఖపట్నం
9290946292
అత్త ఉత్తరం చూసింది
చెత్తను శుభ్రం చేసింది
కొత్త బుట్టలు వేసింది
అత్తరు బాగా పూసింది
పుత్తడి నగలు తీసింది
ఎత్తు గొలుసులు సర్దింది
మత్తు మల్లెలు కోసింది
నత్త నడకలు నడిచింది
ఉత్తర దిక్కుకు చేరింది
తత్తర పాటుగ తిరిగింది
బిత్తర చూపులు తిప్పింది
చిత్తమున ఏదో తలచింది
గుత్తు వంకాయ వండింది
సత్తుల సంకటి కలిపింది
నెత్తల వేపుడు వేపింది
కొంచెం నాకు ఇమ్మంటే
మొత్తం బావకు దాచింది



సూపర్ 👌