google-site-verification: googlee1f767d3d556c059.html

‘బాలన్’ ట్రైలర్‌కు రెస్పాన్స్ అదిరింది.. కానీ తెలుగు డబ్బింగ్‌పై విమర్శల వర్షం

Spread the love

‘బాలన్’ ట్రైలర్‌కు రెస్పాన్స్ అదిరింది.. కానీ

‘బాలన్’ ట్రైలర్‌కు రెస్పాన్స్ అదిరింది.. కానీ తెలుగు డబ్బింగ్‌పై విమర్శల వర్షం


మంజుమ్మేల్ బాయ్స్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చిదంబరం నుంచి వస్తున్న కొత్త సినిమా ‘బాలన్: ది బాయ్’. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ కథ అందించడం, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకోవడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ కూడా కథ, మూడ్, విజువల్స్ పరంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ట్రైలర్‌లో మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లి, ఆమె పరిస్థితుల మధ్య ఇబ్బంది పడే చిన్నారి, ఆ పిల్లాడు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, అతడి కోసం పోలీసుల అన్వేషణ వంటి అంశాలు సస్పెన్స్‌తో నడిచేలా కనిపిస్తున్నాయి. సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, షైజు ఖాలిద్ విజువల్స్ ట్రైలర్‌కు మరింత ఇంటెన్సిటీ ఇచ్చాయి.

అయితే ట్రైలర్‌లోని తెలుగు డబ్బింగ్‌పై మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. విజువల్స్‌ సీరియస్ మూడ్‌ను క్రియేట్ చేసినా, డబ్బింగ్‌లో సరైన ఎమోషన్ కనెక్ట్ కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏఐ డబ్బింగ్‌ను ఉపయోగించారా? అన్న చర్చ కూడా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు ప్రేక్షకుల కోసం సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో డబ్బింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నందున, థియేట్రికల్ వెర్షన్‌లో ఈ లోపాలను సరిచేసి, కథలోని ఒరిజినల్ ఎమోషన్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరేలా చేస్తారని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *