google-site-verification: googlee1f767d3d556c059.html

‘మా ఇంటి బంగారం’ వెనుక బిగ్ ట్విస్ట్

Spread the love

‘మా ఇంటి బంగారం’ వెనుక బిగ్ ట్విస్ట్

రిలీజ్‌కు ముందు సమంత రివీల్‌తో పెరిగిన హైప్

‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు ముందు సమంత ప్రమోషన్స్‌లో దూకుడు పెంచింది. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా కంటెంట్‌తో సినిమాపై హైప్ పెంచుతున్న సమంత.. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

ఈ సినిమాకు మొదటి ఎంపిక తాను కాదని, మేకర్స్ ముందుగా సాయి పల్లవిని అనుకున్నారని సమంత చెప్పింది. అయితే సాయి పల్లవి డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ తన దగ్గరకు వచ్చిందని తెలిపింది. స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసిన తర్వాతే తాను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పింది.

సమంత తన ‘Tralala Moving Pictures’ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండగా, నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సమంత చెప్పిన ఈ ఒక్క రివీల్‌తో ఇప్పుడు సినిమా చుట్టూ కొత్త చర్చ మొదలైంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *