Sravana Somavaram 2026: శివారాధనకు విశేషమైన రోజు.. 12 రాశుల ఫలితాలు ఇవే!
Sravana Somavaram 2026: ఎవరికీ అనుకూలం? ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
తేదీ: 24 ఆగస్టు, 2026 (సోమవారం)
పంచాంగం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం.
తిథి: ద్వాదశి (మరుసటి రోజు తె. 5:28 వరకు) వారం: సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం: పూర్వాషాఢ (రా. 8:56 వరకు) తదుపరి ఉత్తరాషాఢ యోగం: ప్రీతి
|| కరణం: బవ వర్జ్యం: ఉ. 5:42 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం:
మ. 11:53 – 12:43 వరకు, మరల మ. 3:14 – 4:04 వరకు. రాహుకాలం: ఉ. 7:37 నుండి
9:11 వరకు.
విశేషం: శ్రావణ సోమవారం / ప్రదోషం. శివారాధనకు అత్యంత విశేషమైన రోజు.
నేటి గ్రహ స్థితి:
● రవి, శుక్ర, కేతువు: సింహ రాశి.
● చంద్ర: ధనుస్సు రాశి.
● బుధ, గురువు: కర్కాటక రాశి.
● కుజ: వృషభ రాశి || రాహువు: కుంభ రాశి.
● శని: మీన రాశి.
నేటి దైవారాధన:

● విశేష పూజ: శ్రావణ సోమవారం మరియు ప్రదోషం కలయిక. సాయంత్రం శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన చేయడం వల్ల సకల గండాలు, దారిద్ర్యం తొలగుతాయి.
● పఠించవలసినవి: బిల్వాష్టకం, శివ పంచాక్షరీ స్తోత్రం, లింగాష్టకం.
నేటి రాశి బలాబలాలు:
● అనుకూలం: మేషం, సింహం, తుల, కుంభం.
● ప్రతికూలం: వృషభం (అష్టమ చంద్రుడు), కర్కాటకం (షష్ఠమ స్థానం).
నవతారల బలం (పూర్వాషాఢ నక్షత్రం ప్రకారం):
● అనుకూల తారలు (సానుకూలం): ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర, ఆరుద్ర, స్వాతి, శతభిషం, శ్రవణం, రోహిణి, హస్త, ఆశ్లేష, జ్యేష్ట, రేవతి, మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాల వారు ముందడుగు వేయవచ్చు.
● ప్రతికూల తారలు (జాగ్రత్త): అశ్విని, మఖ, మూల, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారు జాగ్రత్త వహించాలి.
నేటి శ్లోకం: (శివ స్తుతి – ప్రదోషం) “మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే | అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః ||“
ద్వాదశ రాశి ఫలితాలు:
- మేషం: (భాగ్య స్థానం) అదృష్టం వరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రదోష పూజలతో లాభం.
- వృషభం: (అష్టమ స్థానం) అష్టమ చంద్ర దోషం. వాదనలకు దిగకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్త.
- మిథునం: (సప్తమ స్థానం) భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. దాంపత్య సౌఖ్యం.
- కర్కాటకం: (షష్ఠమ స్థానం) శత్రువుల బాధ తగ్గుతుంది. ఋణ విముక్తికి మార్గం దొరుకుతుంది.
- సింహం: (పంచమ స్థానం) సృజనాత్మక ఆలోచనలు చేస్తారు. పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది.
- కన్య: (చతుర్ధ స్థానం) గృహంలో అశాంతి. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు.
- తుల: (తృతీయ స్థానం) ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తారు. సోదరుల సహకారం.
- వృశ్చికం: (ధన స్థానం) ఆర్థిక లావాదేవీలు అనుకూలం. కుటుంబ సభ్యులతో సంతోషం.
- ధనుస్సు: (జన్మ స్థానం) ఉత్సాహంగా ఉంటారు. శ్రావణ సోమవార శివ పూజలతో మానసిక ప్రశాంతత.
- మకరం: (వ్యయ స్థానం) అనవసర ఖర్చులు. కంటికి సంబంధించిన ఇబ్బందులు. దైవ చింతన.
- కుంభం: (లాభ స్థానం) ఆర్థికంగా బలపడతారు. మిత్రుల సహకారం అందుతుంది.
- మీనం: (దశమ స్థానం) ఉద్యోగంలో అధికారుల మన్ననలు. నూతన బాధ్యతలు.



