‘నాగబంధం’ కోసం పాన్ ఇండియా ప్లాన్..

Spread the love

‘నాగబంధం’ కోసం పాన్ ఇండియా ప్లాన్..

ప్రమోషన్స్‌లోనే భారీ స్కెచ్!

టాలీవుడ్ నుంచి మరో విజువల్ గ్రాండియర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘నాగబంధం’. అభిషేక్ నామా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హైప్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ భారీ పాన్ ఇండియా ప్రమోషన్ టూర్‌కు సిద్ధమయ్యారు.

ఈ ప్రమోషన్ క్యాంపెయిన్‌ను జూన్ 19న హైదరాబాద్‌లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో మూవీ టీమ్ సందడి చేయనుంది. పాన్ ఇండియా ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ మేకర్స్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు.

ఈ ప్రమోషన్స్‌లో మరో స్పెషల్ అట్రాక్షన్ ‘వీర నాగ’ సాంగ్ లాంచ్. జూన్ 26న పవిత్ర కాశీ నగరమైన వారణాసిలో ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. సినిమా కథ, టైటిల్‌కు తగ్గట్లుగా ఈ ఈవెంట్‌ను స్పిరిచువల్ టచ్‌తో ప్లాన్ చేయడం ఆసక్తి రేపుతోంది.

జూన్ 28న హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. జూలై 2న ప్రత్యేక ప్రీమియర్స్ తర్వాత, జూలై 3న ‘నాగబంధం’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, నాన్ థియేట్రికల్ బిజినెస్‌లోనూ సినిమాకు మంచి క్రేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర భారతదేశం, ఓవర్సీస్ థియేట్రికల్ రిలీజ్‌ను జీ స్టూడియోస్ చూసుకుంటోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *