Ranveer Singhబాలీవుడ్ స్టార్ Ranveer Singh మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి సినిమా ప్రమోషన్లు లేదా కొత్త ప్రాజెక్ట్ కారణంగా కాదు. కొంతకాలం పాటు మీడియా ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఇంటరాక్షన్స్‌కు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల ‘డాన్ 3’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివాదాలు, సోషల్ మీడియాలో జరిగిన చర్చల నేపథ్యంలో రణ్‌వీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం సాగుతోంది. తన తదుపరి చిత్రం ‘ప్రళయ్’ విడుదల వరకు దాదాపు 18 నెలల పాటు మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడకుండా ఉండే అవకాశముందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Ranveer Singh సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యూహాలు కొత్తవి కావు. కొన్నిసార్లు ప్రముఖ నటులు వివాదాల నుంచి దృష్టి మళ్లించి పూర్తిగా తమ సినిమాలపై దృష్టి పెట్టేందుకు మీడియా ఎక్స్‌పోజర్‌ను తగ్గిస్తుంటారు. రణ్‌వీర్ కూడా అదే దారిని ఎంచుకున్నాడా అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
Ranveer Singh అయితే ఈ విషయంపై రణ్‌వీర్ సింగ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.



