release2027sankranti కీర్తి-కృతి ఎంట్రీతో మరింత క్రేజ్.. అనిల్ మల్టీస్టారర్‌కు గ్లామర్ జోడీ!
release2027sankranti ఈ ఫ్రెష్ కాంబినేషన్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు కీర్తి సురేష్, కృతి శెట్టి చేరడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. తాజా లాంచ్ ఈవెంట్లో ఇద్దరు హీరోయిన్లు కూడా సందడి చేయడం అభిమానులను ఆకట్టుకుంది.
వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఫ్రెష్ కాంబినేషన్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయని భావిస్తున్నారు.
కుటుంబ కథా నేపథ్యంలో వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ, వెంకటేష్ టైమింగ్, కళ్యాణ్‌రామ్ మాస్ ఇమేజ్‌కు తోడు కీర్తి-కృతి జోడీ కూడా సినిమాకు ప్లస్ కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




