sayamkalapu coffee

సాయంకాలపు కాఫీ — ఒక అక్షర కావ్యం

Spread the love

రాము కోలా దెందుకూరు 

సంధ్యా ఛాయల నీడన విరిసిన నింగి కింద,  

చిక్కని కాఫీ పొగలు ప్రాణాన్ని తడిపే వేళ,  

మగ్గును పట్టిన వేలికి వెచ్చని స్పర్శ అంది,  

లోకపు హడావిడి మరచి, మౌనం కమ్మేను మెల్లగా!

ఆవిరి తెరల చాటున గతపు జ్ఞాపక చిత్రాలు —  

బాల్యపు అరుగు దిగి యవ్వనపు బాటలు నడిచి,  

అమ్మ చేతి వెచ్చదనంలో తడిసిన ఆ స్మృతులు,  

నేటి ఒంటరి సంధ్యకు తోడుగా నిలిచెను నిత్యం!

చిక్కని రంగులో కరిగిన తీపి విషాదం,  

ప్రతి గుక్కలో హృది విచ్చుకునే పద్మపు రేకు,  

ఆశల కలన్నీ ఒక్కటై పొంగే ఆనందం,  

ఈ మగ్గు కాఫీలో జగమే లయమైన రీతి!

అస్తమించిన సూర్యుని వేడిమి మిగిలెను కాస్త,  

చీకటి నిశ్శబ్దంలో కాఫీ వెచ్చని పరిచయం,  

సంధ్యవేళ కాఫీ మమతై నా నేస్తమై,  

జీవిత ప్రయాణంలో శాశ్వతమై నిలుచు నిత్యం!

రాము కోలా దెందుకూరు 

ఖమ్మం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *