Sing Geetham OTT | అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి ‘సింగ్ గీతం’.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్
విభిన్న కథాంశాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. తొలుత ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. దీంతో జూలై 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో మరింత మందిని చేరుకునే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ప్రధాన పాత్రల్లో ఆయాన్, అహిల్య బమ్రూ నటించగా.. శివన్నారాయణ, తులసి, బెనర్జీ, అనంత్ బాబు, రాచా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించారు. హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు మరో విశేషం.
ప్రకృతిని నాశనం చేయడం వల్ల కలిగే పరిణామాలను వినూత్నంగా చూపిస్తూ రూపొందిన ఈ చిత్రంలో, ఓ గ్రామంలో చోటుచేసుకునే వింత సంఘటనలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సాధారణ సంభాషణల స్థానంలో పాటల రూపంలోనే భావాలను వ్యక్తపరచాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడింది? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అనే అంశాలను దర్శకుడు తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించారు.
Sing Geetham OTT థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు జూలై 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
CLICK HERE TO READ MORE: హీరోలకు 7వ సినిమా సెంటిమెంట్.. అఖిల్‌కు ‘లెనిన్’ కలిసొస్తుందా?



