VenkyAnil5 | వెంకీ-కళ్యాణ్‌రామ్ కలయికకు ఘన ఆరంభం.. అనిల్ రావిపూడి కొత్త మల్టీస్టారర్ షురూ!
టాలీవుడ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఘనంగా జరిగిన పూజా కార్యక్రమంతో సినిమా ప్రయాణం మొదలైంది.
వెంకటేష్‌తో వరుస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి, ఈసారి కళ్యాణ్‌రామ్‌ను కూడా జోడించి మరింత భారీ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగా తన తొలి హిట్ ‘పటాస్’ను కళ్యాణ్‌రామ్‌తో చేసిన అనిల్, దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆయనతో కలిసి పనిచేయడం ప్రత్యేకతగా మారింది.
ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, మాస్ అంశాలు సమపాళ్లలో ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోకు ఉన్న క్రేజ్, కళ్యాణ్‌రామ్ చేరికతో మరింత పెరిగింది.
సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా, 2027 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు. సంగీత బాధ్యతలను జి.వి. ప్రకాశ్ కుమార్ నిర్వహిస్తున్నాడు

click here for read more: పెద్ది’ బాక్సాఫీస్ దూకుడు.. రికార్డులపై రామ్ చరణ్ కన్ను!



