1june2026 | పంచాంగం: రాహుకాలం, రాశిఫలాలు, శివారాధన విశేషాలు
1june2026 | నేటి పంచాంగం వివరాలు
గ్రహస్థితులు & శుభముహూర్తాలు
దైవారాధన & శ్లోకం
రాశుల వారీ ఫలితాలు
అనుకూల & ప్రతికూల రాశులు
పంచాంగం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం.
తిథి: పాడ్యమి (మ. 3:05 వరకు) తదుపరి విదియ
వారం: సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం: జ్యేష్ట (సా. 6:09 వరకు) తదుపరి మూల
యోగం: సిద్ధ
కరణం: కౌలవ
వర్జ్యం: తె. 3:00 నుండి 4:47 వరకు
దుర్ముహూర్తం: మ. 11:48 – 12:40 వరకు, మరల మ. 3:15 – 4:07 వరకు
రాహుకాలం: ఉ. 7:22 నుండి 8:59 వరకు
విశేషం: జ్యేష్ఠ బహుళ పాడ్యమి. చంద్రుడు రాత్రి 11:41 కి ధనుస్సు రాశి ప్రవేశం.
నేటి గ్రహ స్థితి
● రవి: వృషభ రాశి
● శుక్ర, గురువు, బుధ: మిథున రాశి
● కుజ: మేష రాశి
● చంద్ర: వృశ్చిక రాశి
● రాహువు: కుంభ రాశి || శని: మీన రాశి || కేతువు: సింహ రాశి
నేటి దైవారాధన
● విశేష పూజ: సోమవారం మరియు జ్యేష్ట నక్షత్రం (గండమూల నక్షత్రం) కాబట్టి శివాలయంలో రుద్రాభిషేకం అత్యంత శ్రేయస్కరం
● పఠించవలసినవి: శివ పంచాక్షరీ, రుద్ర త్రిశతి

నేటి రాశి బలాబలాలు
● అనుకూలం: కర్కాటకం, కన్య, మకరం, మీనం
● ప్రతికూలం: మేషం (అష్టమ చంద్రుడు), మిథునం (షష్ఠమ స్థానం)
నవతారల బలం
● అనుకూల తారలు: మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, స్వాతి, జ్యేష్ట
● ప్రతికూల తారలు: ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, విశాఖ, అనూరాధ
నేటి శ్లోకం
“మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే |
అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః ||”
ద్వాదశ రాశి ఫలితాలు
- మేషం: అనవసర భయాలు, శారీరక శ్రమ. దైవ నామ స్మరణతో గండాలు గడుస్తాయి
- వృషభం: నూతన వ్యాపార ఒప్పందాలు, దాంపత్య సౌఖ్యం
- మిథునం: శత్రువుల ఆటలు సాగవు, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి
- కర్కాటకం: కళాకారులకు, విద్యార్థులకు మంచి రోజు, ఆలోచనలు ఫలిస్తాయి
- సింహం: వాహన సమస్యలు, ఇంటి పనుల్లో జాప్యం, ప్రశాంతత ముఖ్యం
- కన్య: ధైర్యంగా నిర్ణయాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి
- తుల: కుటుంబంలో సంతోషం, రుచికరమైన భోజనం
- వృశ్చికం: పట్టుదలతో పనులు పూర్తి, శివారాధనతో మేలు
- ధనుస్సు: ఖర్చులు పెరుగుతాయి, రాత్రి నుండి అనుకూలం
- మకరం: ఆర్థిక పరిస్థితి అద్భుతం, బాకీలు వసూలవుతాయి
- కుంభం: పని ఒత్తిడి ఉన్నా కీర్తి పెరుగుతుంది
- మీనం: దైవ దర్శనం, పెద్దల ఆశీస్సులు, ఉన్నత విద్యలో విజయాలు



