భవిష్యత్తులో మాయం అయ్యే ఉద్యోగాలు ఇవే..!
సాంకేతిక విప్లవం ఉద్యోగాలను ఎలా మార్చుతోంది?
ఇప్పటికే ప్రభావం పడుతున్న ఉద్యోగాలు ఏవి?
యంత్రాల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్న పరిశ్రమలు?
బ్యాంకింగ్, కాల్ సెంటర్ రంగాల్లో పెరుగుతున్న మార్పులు
తయారీ రంగంలో ఆటోమేషన్ ప్రభావం
కేవలం ఒకే పనిపై ఆధారపడేవారికి హెచ్చరిక
ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకప్పుడు అత్యంత సురక్షితంగా భావించిన ఉద్యోగాలే ఇప్పుడు అనిశ్చితిలో పడుతున్నాయి. కారణం… సాంకేతిక విప్లవం. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, యంత్రాల ఆధారిత వ్యవస్థలు, స్వయంచాలక సేవలు అనేక రంగాల్లో మనుషుల పనిని తగ్గిస్తున్నాయి.
ఇది కేవలం ఊహ కాదు. ప్రపంచ ఆర్థిక వేదిక, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రముఖ సాంకేతిక సంస్థల నివేదికలు కూడా రాబోయే సంవత్సరాల్లో అనేక సంప్రదాయ ఉద్యోగాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నాయి. అయితే అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా పుడతాయని స్పష్టం చేస్తున్నాయి.
రోజూ ఒకే విధంగా జరిగే పనులను ఇప్పుడు యంత్రాలు వేగంగా చేయగలుగుతున్నాయి. అందుకే డేటా నమోదు, కాల్ సెంటర్ సేవలు, సాధారణ లెక్కల నిర్వహణ, టికెట్ బుకింగ్, బ్యాంకింగ్ కౌంటర్ సేవలు వంటి ఉద్యోగాల్లో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి.
స్వయంచాలక చెల్లింపు యంత్రాలు, ఆన్లైన్ బ్యాంకింగ్, మాట్లాడే యంత్ర సేవలు, స్వయంచాలక కస్టమర్ సమాధాన వ్యవస్థలు, వాడుకలోకి వచ్చాయి. దీంతో సాధారణ కార్యాలయ ఉద్యోగాలపై ఒత్తిడి పెరుగుతోంది.
తయారీ రంగంలో పరిస్థితి మరింత వేగంగా మారుతోంది. కార్ల తయారీ, ప్యాకింగ్, గిడ్డంగుల నిర్వహణ వంటి పనుల్లో ఇప్పుడు యంత్రాల వినియోగం పెరుగుతోంది.
అలసట లేకుండా, తప్పులు తక్కువగా చేస్తూ, వేగంగా పని చేయగల సామర్థ్యం కారణంగా పరిశ్రమలు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నాయి.
దీంతో తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులకు భవిష్యత్తులో సవాళ్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒకప్పుడు దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా వరకు ఇంట్లో నుంచే సరుకులు ఆర్డర్ చేస్తున్నారు.
స్వయంచాలక బిల్లింగ్ వ్యవస్థలు, ఆన్లైన్ మార్కెట్లు పెరగడంతో చిన్నస్థాయి విక్రయ ఉద్యోగాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
అయితే పూర్తిగా మాయం అవుతాయని కాదు… కానీ ఉద్యోగ స్వరూపం మారుతుంది.
ఇప్పటికే వార్తల సంక్షిప్తీకరణ, సాధారణ ప్రకటనలు, సాధారణ పత్రాలు తయారు చేయడంలో కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతోంది.
అందుకే కేవలం యంత్రంలా రాసేవారికంటే… విశ్లేషణ చేయగలిగేవారు, సృజనాత్మకంగా ఆలోచించగలిగే వారికి మాత్రమే భవిష్యత్తులో ఎక్కువ విలువ ఉంటుంది.
మరి ఎవరు ఇప్పట్నుంచే జాగ్రత్త పడాలి అంటే, ఒకే పనిపై ఆధార పడినవారు, సంవత్సరాల తరబడి ఒకే విధమైన పనిలో ఉండిపోయినవారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంకా, సాంకేతిక మార్పులను పట్టించుకోనివారు, “ఇవి మనకు అవసరం లేదు” అని భావించే వాళ్లు భవిష్యత్తులో వెనుకబడే ప్రమాదం ఉంది. ఇక కేవలం సర్టిఫికెట్లపైనే ఆధారపడేవారు. జాగ్రత్త పడడం మంచిది.
ఇప్పుడు కాగితం మీద ఉన్న అర్హతలకంటే… పని చేయగల సామర్థ్యానికే విలువ పెరుగుతోంది.
మరి నిపుణుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో డిమాండ్ పెరగబోయే రంగాలు ఏవంటే,
ఆరోగ్య సేవలు, మానసిక ఆరోగ్య రంగం, సృజనాత్మక రంగాలు, డిజిటల్ ప్రచారం, డేటా విశ్లేషణ
సైబర్ భద్రత, స్థానిక భాషా కంటెంట్, విద్య & శిక్షణ వంటి రంగాల్లో అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
ఎందుకంటే… యంత్రాలు సమాచారం ఇవ్వగలవు. కానీ మనుషుల భావోద్వేగాలు, సంబంధాలు, సృజనాత్మకతను పూర్తిగా భర్తీ చేయలేవు. ఇలాంటి మార్పును అర్థం చేసుకున్నవారిదే భవిష్యత్తు
ప్రతి సాంకేతిక విప్లవం కొంతమంది ఉద్యోగాలను తగ్గించింది. కానీ అదే సమయంలో కొత్త అవకాశాలను కూడా సృష్టించింది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. కానీ మార్పును నిర్లక్ష్యం చేయడం మాత్రం ప్రమాదకరం.
ఈరోజు కొత్త విషయాలు నేర్చుకునేవాళ్లు…రేపటి ప్రపంచంలో నిలబడతారు. కాలం మారుతోంది…
దానితోపాటు మన నైపుణ్యాలు కూడా మారాలి.




