Telugu Ghazal | ఏం తెలుసు? తెలుగు గజల్
Telugu Ghazal: సూరారం శంకర్ “కీర్తి పురస్కార గ్రహీత”, (పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారిచే…)
మాత్లా:
వెన్నెల మనసును తాకే మధురిమ వేకువకేం తెలుసు?
కోకిల గళమున మోగే సరిగమ కాకులకేం తెలుసు ?
షేర్:1
నా యెద నిండా తానై ఒదిగిన శిల్పం దాగుంది
వెలుగే తెలియని చీకటి మొగ్గకు చేతనమేం తెలుసు?
షేర్:2
సుందర స్వప్నం కనులకు కాదు, మనసుకు ఆమోదం
కలలే తెలియని కడలి అలలకు ప్రశాంతతేం తెలుసు?
షేర్:3
ఒద్దిక వుంటే ఓటమి వుందా? జయమే జగమంతా
గ్రీష్మతాపమై వీచే గాలికి నిలకడ ఏం తెలుసు?
షేర్:5 మనసును మీటే మనసుంటే బ్రతుకంతా శోభనమే
గులాబి రేకులు చిదిమే వేళ్ళకు సోయగమేం తెలుసు?
షేర్: 6
నువ్వొక ఆమని నీలో హరితం తెలిసే దెవరికి శంకర్!
మబ్బు గుండెలో చినుకుల చిరుతడి ఎడారికేం తెలుసు?*
click here to read more: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత

