గజల్: ప్రతి అడుగులోనూ జాగ్రత్త నేర్పే ఆలోచనాత్మక కవిత
భారతీ గజల్
రచన :బోర భారతీదేవి,
స్కూల్ అసిస్టెంట్ తెలుగు
విశాఖపట్నం
9290946292

ప్రతీఅడుగు తప్పటడుగు
వేయకుండ ఆపేదెలా
నిశినీడలు జీవితాన
కమ్మకుండ ఆపేదెలా
పరుగులిడే బాల్యంలో
ఉత్సుకతను ప్రదర్శించే
పొంచియున్న ప్రమాదాన్ని
తాకకుండ ఆపెదెలా
ఆదమరచి ఉండకనే
అనుభవమే చెబుతుందే
విచిత్రమైన మనసుగోల
చెప్పకుండ ఆపేదెలా
సరిహద్దుల చెరసాలన
స్వేచ్ఛకోరె విహంగాలు
ఊహించని ఉచ్చులోన
చిక్కకుండ ఆపేదెలా
ఓ భారతి విథి ఆడే
వింతాటన పావులమే
ఏ నిరాశ గళంపోటు
తగలకుండ ఆపేదెలా
click here to read more: ‘కళాతపస్వి’ సినిమాలకు అక్షర నీరాజనం..


చాలా బాగుంది