‘కళాతపస్వి’ సినిమాలకు అక్షర నీరాజనం..
కె. విశ్వనాథ్ అభిమానులకు ప్రత్యేక కానుక!
సమీక్షకుడు: ఎం. రమేశ్ బాబు, నంద్యాల
8179075376
మన తెలుగు సినీ పరిశ్రమలో కళకు, ఆ కళ ఔన్నత్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కళకు తన సినిమాల్లో అగ్రస్థానం కల్పించి కళాతపస్విగా పేరు పొందారు దర్శకులు కె. విశ్వనాథ్. ఆయన సినిమాలను ఇష్టపడని వ్యక్తులెవరు చెప్పండి. ఆ కళాతపస్వి అంటే అందరికీ మక్కువే, కళను అభిమానించే వారికి వారిపై అభిమానం మరింత ఎక్కువే. అలాంటి అభిమానుల్లో ముందు వరుసలో ఉండే అర్హత సాధించుకున్నారు రచయిత రాకేష్ బొద్దుల.

విశ్వనాథ్ సినిమాలలో మేరు పర్వతాల్లాంటి పది సినిమాలతో పుస్తకాన్ని రచించి.. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పుస్తకంలో కొత్తగా అనిపించే పద ప్రయోగాలు చేయడమే కాదు.. సినిమాల గురించి చేసిన వర్ణనల వివరణ నా మాటకు అందట్లేదు అనడం అతిశయోక్తి కాదు. దర్శకుడి భావాల్ని అందిపుచ్చుకున్నట్టుగా ఆయన ఏ ఉద్దేశంతో ఆ సందర్భాన్ని సృష్టించారో అన్న చిన్న చిన్న సంగతుల నుండి, సినిమా నిర్మాణ సమయంలో జరిగిన ప్రత్యేక సందర్భాలను సైతం ఆసక్తిగా తెలుసుకుని మనందరికీ తన పుస్తకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ పుస్తక నిర్మాణంలో కూడా సన్నివేశానికి తగ్గ చిత్రాలతో కళ్ళ ముందు కాగితంలోనే సినిమా చూపించేస్తారు. విచిత్రం ఏంటంటే పుస్తకం చదవడానికి ముందు ఆ సినిమా ఎన్నిసార్లు చూసిన వారైనా ఏదో ఒక సందర్భంలో ఒక కొత్త కోణంలో ఆ సినిమాని చూసేలా రాశారు రచయిత. పుస్తకం చదివాక మళ్ళీ ఓ సారి మనకు ఆ సినిమా చూస్తే గానీ మనసు ఊరుకోదంటే నమ్మండి.
పుస్తకం వివరాలు..
పేరు: కళాతపస్వి కళాభరణాలు
రచయిత: రాకేశ్ బొద్దుల
వెల : రూ. 250
ఫోన్ : 8247765506
Book Order Link : https://www.telugubooks.in/products/kalathapaswi-kalabharanalu?_pos=1&_sid=8bf66a420&_ss=r



https://shorturl.fm/7a33J