WeddingPrivacy11

WeddingPrivacy11: 11 కోట్ల వ్యూస్ కోసం ప్రైవసీని పణంగా పెట్టాలా?

Spread the love

WeddingPrivacy11: వైరల్ కావాలనే కోరికలో ప్రైవసీకి పెరుగుతున్న ముప్పు!

WeddingPrivacy11: లైక్స్, షేర్ల కోసం వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయడం ఎంతవరకు కరెక్ట్?

మన సంప్రదాయంలో పెళ్లిళ్లు ఎవరు జరిపిస్తారు?
అదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఇంకెవరు? పురోహితులు అని చెప్పబోతున్నారా?
ఆగండాగండి… అది ఒకప్పుడు…మరి ఇప్పుడెవరు జరిపిస్తున్నారని ఆలోచిస్తున్నారా?
వీడియోగ్రాఫర్లు! అవును… పెళ్లి తంతు నామమాత్రంగా జరిపించేది పురోహితుడే అయినా, అన్నీ ఫొటోల కోసం, వీడియోల కోసం మళ్లీ మళ్లీ జరిపించేది మాత్రం వీడియోగ్రాఫర్లే.
అఫ్‌కోర్స్.. అలా ఎంకరేజ్ చేస్తున్నది కూడా వధూవరులు, వాళ్ల తరఫువాళ్లే అనుకోండి.
ఒక పోజు పెద్దల కోసం… అదే తంతు మళ్లీ ఫ్రెండ్స్ కోసం… మరో షాట్ సోషల్ మీడియా కోసం…
ఇలా మళ్లీ మళ్లీ మళ్లీ పెళ్లి!


సరే.. పాయింట్‌లోకి వద్దాం. పెళ్లి అంటే వీడియోలూ, ఆల్బమ్‌లూ… మళ్లీ మళ్లీ చూసుకోవడానికి అంటే ఓకే. ఎన్ని పైత్యపు వేషాలేసినా చల్తా హై. కానీ, పెళ్లి తరువాత జరిగేది…అదేనండీ…
శోభనం…అదెవరు షూట్ చేసుకుంటారనుకుంటున్నారా? చేసుకున్నారు. చేసుకుని పర్సనల్‌గా దాచుకుంటే అందులో విడ్డూరం ఏముంది? కానీ పదిమందిలో షేర్ చేసుకున్నారు కూడా…
ఎందుకు ఈ పైత్యం అంటే ఇంకా రీజనేముంటుంది? కేవలం లైకులు, షేర్ల కోసమేనా?
ఛీ.. మరీ ఎంత లైకుల కోసం అయితే మాత్రం…ఎంతకు తెగించారు?
ఎవరు వారు… అనుకుంటున్నారా? వాళ్లెవరో.. ఆ కథేమిటో చూడండి మీరే.

శోభనం గదిలో వధువు వీడియో వైరల్.. 11 కోట్ల వ్యూస్ అంటూ ప్రచారం

సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం కొందరు ఎంతటి హద్దులకైనా వెళ్లిపోతున్నారనే చర్చ తరచూ జరుగుతూనే ఉంది. పబ్లిసిటీ కోసం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా బహిరంగంగా పెట్టడం ఇప్పుడు కొత్తేమీ కాదు.అలాంటి చర్చకే కారణమైంది రాయ్‌పూర్‌కు సంబంధించినదిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కథనం. వైరల్ కథనం ప్రకారం.. నూతన వధువుగా ఉన్న ఓ మహిళ వివాహ రాత్రికి సంబంధించిన వ్యక్తిగత విషయాలతో వీడియో చేసినట్లు, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోకు 18 గంటల్లోనే 110 మిలియన్లు.. అంటే 11 కోట్ల వ్యూస్ వచ్చాయని కూడా కథనం చెబుతోంది.

అంతేకాదు.. ఆ వీడియోను ఆమె భర్తే చిత్రీకరించాడని, దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అందులో చూపించారని కూడా వైరల్ కథనంలో పేర్కొన్నారు.

(అయితే ఈ కథనంలోని ప్రతి అంశాన్నీ స్వతంత్రంగా ధృవీకరించిన పోలీసు ప్రకటన లేదా ఇతర ప్రధాన వార్తా సంస్థల నిర్ధారణ ప్రస్తుతం లేదు. కాబట్టి వైరల్ అవుతున్న కథనం మాత్రమే )

WeddingPrivacy11
WeddingPrivacy11


అయితే…ఈ కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే, ఇది లేవనెత్తుతున్న ప్రశ్న మాత్రం చాలా పెద్దదే. లైకుల కోసం వ్యక్తిగత జీవితం కూడా పబ్లిక్‌గానేనా? ఒకప్పుడు ఇంట్లో జరిగిన విషయం ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు? ఇంట్లో ఏం జరిగినా ముందు కెమెరా ఆన్ అవుతోంది. పెళ్లి అంటే కెమెరా. రిసెప్షన్ అంటే కెమెరా. హనీమూన్ అంటే కెమెరా. భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్లినా కెమెరా. ఇంతవరకు ఓకే. జీవితంలోని అందమైన జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోలుగా దాచుకోవడంలో తప్పేముంది? కానీ దాంపత్య జీవితంలోని అత్యంత వ్యక్తిగత క్షణాలను కూడా కెమెరాలో బంధించి ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఏముంది?
వైరల్ కథనంలో చెప్పినట్టుగా నిజంగానే అలాంటి వీడియోను ఎవరైనా పబ్లిక్‌గా పెట్టి ఉంటే.. దానికి కారణం ఏంటి..? ఫేమ్? లైక్స్? షేర్లు? ఫాలోవర్లు? లేక రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోవాలన్న కోరిక? పెళ్లి వీడియో నుంచి శోభనం గది వరకు…నిజానికి మనం ఎక్కడికి వచ్చేశామో ఒక్కసారి ఆలోచించాలి. పెళ్లిలో తాళి కట్టే సన్నివేశాన్ని మళ్లీ చేయిస్తాం.

WeddingPrivacy11
WeddingPrivacy11


జీలకర్ర బెల్లం పెట్టిన పోజు మళ్లీ చేయిస్తాం. దండలు మార్చుకోవడం మరోసారి.
పెద్దల కోసం ఒక ఫొటో. ఫ్రెండ్స్ కోసం ఇంకో ఫొటో.రీల్ కోసం మరోసారి. అలా ఒక పెళ్లి కార్యక్రమం కెమెరా కోసం ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో లెక్కే లేదు. అయినా అదంతా సరదాగానే తీసుకోవచ్చు.
ఎందుకంటే అవి పబ్లిక్‌గా జరిగే కార్యక్రమాలు. కానీ వ్యక్తిగత జీవితానికి కూడా అదే కెమెరాను తీసుకెళ్తే? అక్కడే అసలు గీత చెరిగిపోతుంది. భర్తే వీడియో తీశాడన్న ప్రచారం ఈ వైరల్ కథనంలో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. వీడియోను భర్తే చిత్రీకరించాడని అందులో పేర్కొన్నారు. వీడియోలో భార్య అసౌకర్యంగా కనిపించిన సందర్భాలు ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 11 కోట్ల వ్యూస్ వస్తే.. ? రికార్డు! కానీ… ఆ వ్యూస్ కోసం మనం ఏం కోల్పోయాం?
మన ప్రైవసీ?

సోషల్ మీడియా ఇప్పుడు పెద్దలకు మాత్రమే పరిమితం కాదు. చిన్న పిల్లల నుంచి యువత వరకు అందరూ చూస్తున్నారు. అందుకే వ్యక్తిగత, అభ్యంతరకరమైన కంటెంట్‌ను విచ్చలవిడిగా ప్రచారం చేయడం వల్ల దాని ప్రభావం ఎక్కడికి వెళ్తుందో ఆలోచించాలి.
సోషల్ మీడియాలో కనిపించడమే ఫేమ్ కాదు. ఎక్కడ కనిపించకూడదో తెలుసుకోవడమే అసలైన తెలివి.

click here to read more

click here to read నవ్వినా, ఏడ్చినా మనసుకు మంచిదే! కన్నీళ్ల వెనుక అసలు సైన్స్ ఇదే

WeddingPrivacy11

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *