Ravi Teja Irumudi OTT Deal ఓటీటీ డీల్‌తో రిలీజ్‌కు ముందే హైప్..
Ravi Teja Irumudi OTT Deal రవితేజ ‘ఇరుముడి’పై భారీ బజ్!
Ravi Teja Irumudi OTT Deal మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ రిలీజ్‌కు ముందే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా ఓటీటీ డీల్‌కు సంబంధించిన వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవితేజ కొత్త లుక్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథాంశం సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ.14 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌కు ముందే ఇంత మంచి ఓటీటీ డీల్ రావడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనమని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఫస్ట్ గ్లింప్స్ రెస్పాన్స్, ఓటీటీ డీల్ బజ్‌తో ‘ఇరుముడి’ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రవితేజకు ఈ సినిమా మరో బలమైన విజయాన్ని అందిస్తుందా? అనేది చూడాలి.
CLICK HERE FOR READ MORE : ‘మా ఇంటి బంగారం’ వెనుక బిగ్ ట్విస్ట్



