Samantha | ‘ఫ్యామిలీ మ్యాన్’ కాదు.. అదే నా బెస్ట్ మూవీ!
Samantha |తన కెరీర్‌లో బెస్ట్ సినిమా ఏదో సమంత వెల్లడించారు. ది ఫ్యామిలీ మ్యాన్‌ను కాదని ‘ఏ మాయ చేసావే’ను ఎంచుకున్న కారణం ఇదే.
Samantha |స్టార్ హీరోయిన్ సమంత తన సినీ ప్రయాణంలో ప్రత్యేక స్థానమున్న సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో ఇష్టమైన వాటిని ఎంచుకున్నారు.
ర్యాపిడ్ ఫైర్‌లో ‘ఏ మాయ చేసావే’, ‘ఈగ’ చిత్రాల్లో ఒకదాన్ని ఎంపిక చేయాలని అడగగా.. సమంత వెంటనే ‘ఏ మాయ చేసావే’ పేరు చెప్పారు. ఆ సినిమాతోనే తన కెరీర్ ప్రారంభమైందని, అది లేకపోతే ‘ఈగ’ వంటి భారీ అవకాశాలు వచ్చేవి కావని తెలిపారు.
అలాగే ‘అ ఆ’ కంటే ‘ఓ బేబీ’, ‘యశోద’ కంటే ‘రంగస్థలం’ చిత్రాలను ఎంచుకున్నారు. వెబ్‌సిరీస్‌లలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ కంటే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ తనకు ఇష్టమని చెప్పారు.
Samantha |అయితే చివరగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఏ మాయ చేసావే’ మధ్య ఒకదాన్ని ఎంచుకోవాలని అడగగా.. మరోసారి తన తొలి చిత్రానికే సమంత ఓటు వేశారు. ‘ఆ సినిమా లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. అది నా జీవితాన్ని మార్చింది’ అని చెప్పారు.
తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సిరీస్‌ను కాదని, కెరీర్‌కు పునాది వేసిన తొలి సినిమాను సమంత ఎంచుకోవడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

click here to read more : విజయ్ దేవరకొండతో ‘మనం’ దర్శకుడు.. తెరపైకి క్రేజీ కాంబో!



