World Music Day 2026

World Music Day 2026: మనసును మాయ చేసే సంగీత శక్తి

Spread the love

World Music Day 2026: మనసును మాయ చేసే సంగీత శక్తి

భాషలకు అతీతంగా భావాలను కలిపే సంగీతం
భారతీయ సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రత్యేక స్థానం
మ్యూజిక్ థెరపీ: సంగీతంతో ఒత్తిడికి ఉపశమనం
సంగీతం వింటే మెదడులో జరిగే శాస్త్రీయ మార్పులు
రేడియో నుంచి మొబైల్ వరకు సంగీత ప్రయాణం
మంచి పాట ఇచ్చే భావోద్వేగ అనుభూతి
సంగీతం కేవలం వినోదమా? లేక జీవిత భాగమా?

జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం
ఒక పాట…
కొన్ని సార్లు మనిషిని నవ్విస్తుంది.
కొన్ని సార్లు ఏడిపిస్తుంది.
ఇంకొన్ని సార్లు… సంవత్సరాల క్రితం మర్చిపోయిన జ్ఞాపకాలను కూడా ఒక్కసారిగా కళ్ల ముందుకు తీసుకొస్తుంది.

అదే సంగీతం చేసే మ్యాజిక్.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్ 21న “ప్రపంచ సంగీత దినోత్సవం” జరుపుకుంటారు.
కానీ నిజం చెప్పాలంటే… సంగీతాన్ని ప్రేమించే వాళ్లకు ప్రతి రోజూ సంగీత దినోత్సవమే!

సంగీతానికి అసలు భాషతో పనేమిటి..?
ఒక తమిళ పాట విన్న తెలుగు వ్యక్తి కూడా ఫీల్ అవుతాడు.
హిందీ అర్థం కాకపోయినా… కొన్ని మెలోడీలు నేరుగా హృదయాన్ని తాకేస్తాయి.
ఎందుకంటే… సంగీతం పదాలతో కాదు, భావాలతో మనసును తట్టిలేపుతాయి.

మన పూర్వీకులు ఈ విషయాన్ని చాలా కాలం క్రితమే గుర్తించారు. అందుకే భారతీయ సంస్కృతిలో సంగీతానికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. దేవాలయాల్లో మంత్రాలు కూడా ఒక లయతోనే వినిపిస్తాయి. జోలపాటల నుంచి యుద్ధ డప్పుల వరకు… ప్రతి శబ్దంలోనూ ఒక భావోద్వేగం దాగి ఉంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…
ఇప్పుడు ప్రపంచం “మ్యూజిక్ థెరపీ” అని కొత్తగా మాట్లాడుతున్న విషయాన్ని మన పూర్వీకులు ఏనాడో గురితంచారు, ఆచరించారు. ఫలితాలను రుజువు చేసి కూడా చూపించారు.

కొన్ని రాగాలు మనసును ప్రశాంతంగా మారుస్తాయని, కొన్ని స్వరాలు ఒత్తిడిని తగ్గిస్తాయని సంగీత శాస్త్రంలో అప్పట్లోనే చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఆసుపత్రుల్లో మంద్రస్థాయిలో సంగీతం వినిపించడం… ధ్యానం సమయంలో ప్రత్యేక సంగీతం వినడం… ఇవన్నీ సంగీతం మన మెదడుపై చూపే ప్రభావం వల్లే.

శాస్త్రీయంగా చూస్తే… సంగీతం వింటున్నప్పుడు మెదడులో “హ్యాపీ హార్మోన్స్” విడుదల అవుతాయి. అందుకే టెన్షన్‌లో ఉన్నప్పుడు చాలామంది ఇష్టమైన పాట పెట్టుకుని వినాలి.

ఒకప్పుడు రేడియోలో ఇష్టమైన పాట కోసం గంటల తరబడి ఎదురు చూసేవారు. తర్వాత క్యాసెట్లు వచ్చాయి… సీడీలు వచ్చాయి… ఇప్పుడు ఒక్క మొబైల్‌లో లక్షల పాటలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం మారలేదు — మంచి పాట వినగానే వచ్చే ఆ ఫీలింగ్.

అందుకే సంగీతం కేవలం వినోదం కాదు…
మనిషి జీవితానికి కనిపించని భావోద్వేగ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.

కొన్ని గాయాలకు మందులు అవసరం అవుతాయి…
కానీ కొన్ని బాధలకు ఒక మంచి పాట చాలు!

World Music Day 2026

click here to read more: స్టేటస్, చానెల్స్, వీడియో కాల్స్‌లో కొత్త మార్పులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

google-site-verification: googlee1f767d3d556c059.html