21june2026mysunday పెళ్లిళ్లు ఎందుకు కుదరడం లేదు?1
21june2026mysunday పెళ్లిళ్లు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు
అబ్బాయి తల్లిదండ్రుల వాదన ఏమిటి?
అమ్మాయిలపై వినిపిస్తున్న ప్రధాన అభ్యంతరాలు
అమ్మాయి తల్లిదండ్రుల వాదన ఏమిటి?
అబ్బాయిలపై వినిపిస్తున్న ప్రధాన అభ్యంతరాలు
కాంప్రమైజ్ ఎందుకు అవసరం?
సరైన వయసులో వివాహం ఎందుకు ముఖ్యం?
నేటి పెళ్లి సంబంధాల్లో మారుతున్న అంచనాలు
ఎవరెస్ట్ శిఖరం అయినా ఎక్కవచ్చు గానీ ఈరోజుల్లో అమ్మాయి అబ్బాయిలకి పెళ్లి చేయడం చాలా కష్టమైపోతుంది.. ఎందుకు అంటే అందరికీ తెలుసున్నదే. ప్రతి అమ్మాయి తల్లిది ప్రతి అబ్బాయి తల్లిది అదే బాధ. వాళ్ళదే తప్పని అమ్మాయి తల్లిదండ్రులు, వీళ్ళదే తప్పని అబ్బాయి తల్లిదండ్రులు- ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. నా అభిప్రాయంలో నిజానికి ఇద్దరిదీ తప్పే. ఎవరి కోరికలు వారివి. “అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరడం లేదండి! ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి!!” అని అమ్మాయి తల్లిదండ్రులు, “మా అబ్బాయికి ఇంకా పెళ్లి కుదరలేదు ఏదైనా సంబంధం చెప్పండి” అని అబ్బాయి తల్లిదండ్రులు నాకు చెబుతూ ఉంటారు.
ఎందుకంటే నాకున్న ఇద్దరు అబ్బాయిలకి పెళ్లిళ్లు అయిపోయి బాధ్యతలు తీరిపోయి ఖాళీగా ఉన్నానని వాళ్ళ భావన. నిజానికి నేనేం ఖాళీగా లేను. అయినా వాళ్ళ బాధని అర్థం చేసుకుని కావాల్సిన హెల్ప్ చేయాలని నా సంకల్పం. కానీ ఏదీ కుదరడం లేదు. ఎందుకంటే ఎవరి కోణంలో వారిది కరెక్ట్ అనుకొని అలా దాటవేస్తున్నారు.
చూస్తుండగానే అమ్మాయిల వయసు 30 దాటిపోతుంది అబ్బాయిల వయసు చెప్పనక్కర్లేదు. ఎందుకు అడ్జస్ట్ కారు? ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సిందే లైఫ్ లో! ఇప్పుడైతే ఒకటో రెండో కాంప్రమైజ్ అయితే సరిపోతుంది అదే ఏజ్ పెరిగితే చాలా విషయాలు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అదే చెప్తుంటాను నేను అందరికీ. ఎవరి విషయంలో వాళ్ళు కరెక్ట్ అనుకునే స్టేజిలో ఉన్నారు అందరూ.
అబ్బాయి తల్లిదండ్రుల వెర్షన్లో …
“అమ్మాయిలు ఈమధ్య మరి దారుణంగా తయారయ్యారు..
సంపాదిస్తున్నామన్న అహంకారం ఎక్కువైంది…
ఎవరి మాట వినడం లేదు..
అమ్మాయి తల్లి అయితే మరీనూ…
కూతురి ప్రతి విషయంలో జోక్యం చేసుకొని గారాబం చేసి నెత్తికెక్కించుకుంటున్నారు…
అబ్బాయి కోట్లు సంపాదించాలి 30 దాటకూడదు…. కారు ఉండాలి, విల్లా ఉండాలి, బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, ఈ ఎం ఐ లు ఉండకూడదు తను ఎలా ఉన్నా పర్లేదు అబ్బాయి మాత్రం మహేష్ బాబు లా ఉండాలి” అనుకుంటున్నారు. అసలు అన్ని కోట్లు 30 ఏళ్లకు ఎలా సంపాదించగలరు? ఆ మాత్రం ఆలోచన ఉండదు.. ఆడపడుచులు ఉండకూడదు, సింగిల్ కొడుకు ఉంటే ఇంకా బెటర్ అట..! ఎందుకంటే ఆస్తి మొత్తం ఒక్కడికే రావాలని దురాశ..! పెళ్లయ్యాక వేరే కాపురం పెట్టేయాలి, అత్త మామ జంజాటన ఉండొద్దు, ఏ బాధ్యతలు లేకుండా టింగు రంగమని ఒక్కరే తిరగాలి ఇంకా కొందరైతే అబ్బాయి తల్లిదండ్రుల హెల్త్ రిపోర్ట్ కూడా ఎంక్వయిరీ చేస్తున్నారు.

వాళ్లు కూడా హెల్తీగా ఉండాలట.. లేదంటే ఏదైనా వయసు పైబడి రోగాలు వస్తే సేవ చేసే మాట దేవుడెరుగు, మనిషిని పెట్టి చాకిరికి ఖర్చు పెట్టాలని బాధ.. అమ్మాయితో బాటు వాళ్ళ తల్లిదండ్రులని కూడా పోషించాలని కండిషన్ పెట్టే అమ్మాయిలు కూడా ఉన్నారండోయ్! పిల్లల్ని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడే కంటారట- ఫోర్స్ చేయకూడదట..! అత్తగారు గాని, మామగారు గాని ఏదీ శాసించ కూడదు.. వారి ఇష్టమున్నట్టు వాళ్ళు ఉంటారట! అమ్మో!! అమ్మాయిల ఆశలు కోకొల్లలు.. అందుకే మా అబ్బాయికి కుదరడం లేదని గోల.. ప్యాకేజీ ఎంత? అని అడగడంతోనే స్టార్ట్ అవుతున్నాయి గొడవలు. ఫ్లాట్ ఉంటే పనికిరాదు. విల్లాలు కావాలి.
అమ్మాయిల ఆశలకు అంతు లేకుండా పోతుంది 30 ఏళ్లు దాటినా పెళ్లి మాట ఎత్తని వాళ్ళు మరొకరు.. వింటుంటే విచిత్రంగా ఉంటుంది. నాకు తెలిసిన 35 ఏళ్ల అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు. కారణం “మేము కోటీశ్వరులం, మాకు అలాంటి వాళ్లే కావాలి కదా ఆంటీ” అంటుంది. ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుంటే ఈపాటికి నలుగురు పిల్లల తల్లి అయ్యేది ఆ పిల్ల. చెప్పినా వినని ఇటువంటి పిల్లలు కొందరు.
ఇక అమ్మాయి తల్లిదండ్రుల వెర్షన్..
అబ్బాయిలు మరీ దారుణం.. కట్నం కావాలి, ఇటు ఉద్యోగం చేసి సంపాదించే అమ్మాయి కావాలి.
ఎలా దొరుకుతారండి అన్నీ ఉన్న అమ్మాయిలు?
వంట రావాలి, సంపాదించాలి, అత్త మామల్ని బాగా చూసుకోవాలి.
ఇలాంటి అబ్బాయిలు కొందరు..
అమ్మాయి జీవితం మొత్తం తమకే ఇవ్వాలి.
ఖర్చులు సొంతంగా పెట్టుకోకూడదు తమదే పై చేయి ఉండాలి.
ఖాళీగా ఉండకూడదు.. ఎలాగోలా సంపాదించే తెలివితేటలు ఉండాలి.
బిజినెస్ అయినా పర్లేదు,
నిజానికి నేను గమనించింది ఏమిటంటే ఈరోజుల్లో అబ్బాయిల కండిషన్లు కంటే అమ్మాయిల కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది.
ఏది ఏమైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కాంప్రమైజ్ అయ్యి వివాహాలు సరైన సమయంలో చేసుకుంటే ముచ్చటగా ఉంటుంది. అదే అంకుల్స్ అయిపోయాక చేసుకుంటే ఏం బాగుంటుంది? మీరే చెప్పండి! సో, ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం! తొందరగా కుదుర్చుకుని మాకు పప్పన్నం పెట్టండి అది బెటర్!! అర్థం చేసుకుంటే బోలెడు ఉంది..
అర్థం కాకుంటే మీ ఖర్మ..
వచ్చేవారం మరో ట్రెండీ టాపిక్ తో కలుద్దాం…
-ముచ్చర్ల రజనీశకుంతల
click below image to read




