Manam Manushulame Kani Poem మానవ సంకల్పం, సృజనాత్మకత, పట్టుదల, దైవ విశ్వాసం ఎంత గొప్పవో తెలియజేసే ‘మనం మనుషులమే, కానీ..!’ అనే ప్రేరణాత్మక తెలుగు కవిత.
మనం మనుషులమే, కానీ…
నీలకంఠుడి వారసులం!
ఆయన గరళాన్ని భారంగా భావించలేదు.
మనమూ అంతే, అవసరమైనప్పుడు అగ్నిపర్వతాన్ని
గుండెలో దాచుకుని మామూలుగా తిరిగేస్తాం!
ఉప్పెనని ఊపిరిలో కలిపేసి కష్టాల్ని ఊదేస్తాం!
మనం మనుషులమే, కానీ…
ప్రపంచ సృష్టికర్త బ్రహ్మ ప్రతిబింబం మనం!
అందుకే, చతుష్షష్టి కళల్ని అగ్రభాగాన నిలబెట్టాం!
మయసభ మర్మాల్ని కనుక్కోగలం!
అరచేత్తో అద్భుతాల్ని సృష్టించగలం!
పట్టుదలలో విక్రమార్కుడి మార్కును దాటేస్తాం!
కమిట్ అయినదానికి కట్టుబడి వుంటాం!
సంకల్ప సాధన కోసం సప్త సముద్రాల్నైనా దాటేయగలం!
మనం మనుషులమే, కానీ…
విశ్వకర్మే విస్తుపోయే దివ్య నగరాల్ని రూపొందించగలం!
నిఖార్సైన నిర్మాణాలకు రూపకల్పన చేయగలం…!
దైవంపై మనకున్న అపారమైన నమ్మకమే
ఈ కొండంత శక్తికి సిసలైన మూలం…!!
రచయిత: అన్నమయ్య
click here to read more: జ్ఞాని.. తనలో తానే విశ్వమైపోయిన బాలుడు

