Funny Honeymoon Story Telugu

Funny Honeymoon Story Telugu | పెళ్లాంతో ప్రేమయాత్ర..

Spread the love

Funny Honeymoon Story Telugu | పెళ్లాంతో ప్రేమయాత్ర..

Funny Honeymoon Story Telugu | హనీమూన్‌కు వెళ్లి కుటుంబ యాత్రగా మార్చుకున్న కొత్త జంట!

Funny Honeymoon Story Telugu

“ఏమండీ! మనం హానీ మూన్ ఆగ్రాకు వెళదామండీ!” అని పెళ్లిరోజు రాత్రి కొత్త పెళ్ళాం మనోజ్ఞ కోరిన మొదటి కోరిక తీర్చడం తన ధర్మం కదా అనుకున్నాడు విఘ్నేష్.
పెళ్లి సంబరాలన్నీ అయ్యాక వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు.

“పెద్దమ్మ ఫోన్ చేసింది నీకు!” అని ఫోన్ చేతికిచ్చింది తల్లి సుగుణ

Funny Honeymoon Story Telugu

“ఏరా! ఢిల్లీ వెళ్తున్నావటగా? అక్కడ కార్తీక్ అన్నయ్య ఇంటికేగా వెళ్ళటం?” అడిగింది పెద్దమ్మ.

“లేదు పెద్దమ్మా! అన్నయ్య ఇంటికి మరోసారి వెళ్తాం. ఇప్పుడు హోటల్ లో దిగుతాం. అక్కడి నుంచి ఆగ్రా, జయపూర్ వెళ్తాం.” అన్నాడు విఘ్నేష్.

Funny Honeymoon Story Telugu |

“తెలుసులేరా! మీరు హనీ మూన్ కు వెళ్తున్నారని. మీ అన్నయ్యకు ఇష్టమని గుమ్మడి వడియాలు చేశాను. నువ్వెలాగూ ఢిల్లీ వెళ్తున్నావుగా! అవి వాడికి ఇచ్చేసి, మళ్ళీ మీ హనీమూన్ కు వెళ్ళండి.” బ్రతిమాలుకుంటోంది పెద్దమ్మ.

ఆవిడ కొడుకు చాలా సంవత్సరాలనుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. ఎప్పుడో కానీ రాడు. ఏం మాట్లాడాలో తోచలేదు. చివరికెలాగో “అలాగే” అన్నాడు. పోనీ ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళి ఇచ్చేయవచ్చులే అనుకున్నాడు. మనోజ్ఞను ఎలాగో ఒప్పించాడు. “చిన్నప్పటినుంచీ మేము బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. అందుకే…” నసిగాడు.
పొద్దున్నే వడియాల డబ్బా పంపింది పెద్దమ్మ.

Funny Honeymoon Story Telugu |

ఎయిర్ పోర్టుకు టాక్సీ బుక్ చేశాడు. ఇదిగో అదిగో అంటూ కాస్త లేటుగా వచ్చాడు టాక్సీ వాడు. మొత్తం మీద ఎయిర్ పోర్టు చేరుకుని బోర్డింగ్ పాస్ తీసుకున్నారు. ఇద్దరూ పక్కన పక్కన కూర్చుందామనుకున్న వాళ్ళ ఆశ నిరాశ అయింది. లేటుగా వెళ్ళడం వల్ల వీళ్లకు వేరు వేరు చోట్ల మధ్య సీట్లు దొరికాయి. “కాస్త డబ్బు ఎక్కువ కడితే హాయిగా కోరుకున్న సీట్లు దొరికేవిగా!” అని మనోజ్ఞ గొణిగింది. పెళ్లి హడావుడిలో పడి అలా చేయడం కుదరలేదు.

‘పోనీలే హోటల్ రూమ్ లో స్వీట్ నథింగ్స్ చెప్పుకోవచ్చులే!’ అనుకున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో బ్యాగేజి కలెక్ట్ చేసుకుని చెట్టాపట్టాలేసుకుని బయటికి వచ్చారు.

“ఒరేయ్ విఘ్నేష్! ఇక్కడ! ఇక్కడా!” అన్న పిలుపుకు ఆవైపు చూసిన వాళ్లకు నోట మాట రాలేదు. ఎదురుగా అన్నయ్య కార్తీక్.

“అన్నయ్యా! నీ గుమ్మడి వడియాల డబ్బా, సూట్ కేసులో ఉంది. ఇక్కడే తీసివ్వమంటావా?” అన్నాడు విఘ్నేష్. ‘ పోనీలే! వీళ్ళింటికెళ్ళే పని లేదు. ఒకరోజు కలిసివచ్చింది.’ అనుకుని సంతోషపడ్డాడు.

“అవసరం లేదు. కారు తెచ్చాను. పద ఇంటికి.” అన్నాడు.

Funny Honeymoon Story Telugu |

“హోటల్ రూమ్ కెళ్ళి, మళ్ళీ వస్తాంలే!” అన్నాడు.

“మా ఇల్లు పెట్టుకుని హోటల్ లో దిగుతావా?” బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. బిక్కమొహం వేసుకుని వెళ్ళారు ఇద్దరూ.
ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది రేఖ.

వాళ్లింట్లోనే ఉండాలని పట్టు బట్టారు. హోటల్ రూమ్స్ కాన్సిల్ చేయించారు.

మరుసటి రోజు అన్నయ్యా, వదిన వెంట రాగా ఆగ్రా, జయపూర్ లకు వెళ్ళి వచ్చారు. పాపం కొత్త జంటకు ఏకాంతమే దొరకలేదు. అలా జరిగింది వాళ్ళ హనీమూన్.
ఏడుపు మొహాలతో వాపసు వచ్చేశారు.


వీళ్ళు వచ్చేసరికి విఘ్నేష్ కు బెంగళూరికి ట్రాన్స్ఫర్ అయినట్టు వార్త. సంతోష పడ్డారు ఇద్దరూ.

బెంగళూరులో కొత్త సంసారం పెట్టడానికి తోడుగా విఘ్నేష్ తల్లి సుగుణ వచ్చింది. ‘ మేము ఏమైనా పసిపిల్లలా? ఆ మాత్రం ఇల్లు సర్దుకోలేమా? ఇద్దరూ ఆడుతూ పాడుతూ ఇల్లు డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఈవిడ తగుదునమ్మా అని వచ్చేయడమే! ‘ మనసులోనే విసుక్కుంది మనోజ్ఞ. పది రోజులు ఉండి వెళ్ళింది సుగుణ. ఆవిడను తీసుకుని బెంగళూరంతా చూపించారు.


కనీసం ఈ ఊరు కూడా మేమే చూద్దామంటే వీలు కాలేదు.’ లోలోపలే పళ్ళు నూరుకుంది.

“ఏమండీ! కనీసం మైసూరైనా మనమిద్దరే వెళదామండీ!” ఆశగా అడిగింది భర్తను.

భార్య వైపు జాలిగా చూసాడు. అలాగే అని అభయమిచ్చాడు.

Funny Honeymoon Story Telugu |

మూడు రోజులు సెలవు పెట్టాడు మైసూర్ కు వెళదామని.
పొద్దున్నే డోర్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే…మనోజ్ఞ అమ్మా నాన్నలు నవ్వుతూ నిల్చున్నారు.

“అమ్మడూ! ఎలా ఉంది సర్ప్రైజ్ విజిట్?” అన్నది అత్తగారు భానుమతి.

ఏడవలేక నవ్వాడు విఘ్నేష్. మనోజ్ఞ మాత్రం చాలా సంతోషపడింది.

ఈసారి అందరూ కలసి మైసూర్ కు వెళ్ళారు. ఇలా ముగిసింది వాళ్ళ ఏకాంత ప్రేమయాత్ర.

click here to read more: మంగలి కత్తెరకు పేటెంటేది?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

google-site-verification: googlee1f767d3d556c059.html